గణేష్ నిమజ్జనం సందర్భంగా నేడు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో మద్యం దుకాణాలు బంద్

Sep 25, 2026 - 19:29
 0  0
 గణేష్ నిమజ్జనం సందర్భంగా నేడు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో మద్యం దుకాణాలు బంద్

 అలంపూర్, అయిజ, గద్వాల, వడ్డేపల్లి మున్సిపాలిటీలలో, ఎర్రవల్లి లో వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాల మూసివేతకు కలెక్టర్ ఆదేశాలు

ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా చర్యలు

జోగుళాంబ గద్వాల 25 సెప్టెంబర్ తెలంగాణ వార్త ప్రతినిధి :  గద్వాల. జిల్లాలో గణేష్ నవరాత్రుల ముగింపు సందర్భంగా  తేది.25.09.2026 శుక్రవారం   నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జనాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్ శ్రీ రిజ్వాన్ భాషా షేక్, ఐఏఎస్  ఆదేశాల మేరకు శుక్రవారం తేది 25.09.2026 ఉదయం  06 గంటల నుండి తేది. 26.09.2026 ఉదయం 06 గంటల వరకు గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ ఈ నాలుగు మున్సిపాలిటీలతో పాటు ఎర్రవల్లిలో కూడా  వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు.  నేడు గణేష్ నవరాత్రులలో చివరి రోజు  గణేష్ విగ్రహాల నిమజ్జన, ఊరేగింపులు జరగనున్న నేపథ్యంలో ప్రజల రాకపోకలు, భద్రత, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ  పేర్కొన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలోని మద్యం దుకాణాల నిర్వాహకులు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయాలు నిర్వహించినట్లయితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
గణేష్ నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ  కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333