ఖమ్మంలో ఘనంగా అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు""టిడిపి పార్టీ అడా హాక్ కమిటీ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం: తెలుగుదేశం పార్టీ అడహక్ కమిటీ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాదం గారి ఆదేశానుసారం ఘనంగా అన్న నందమూరి తారకరామారావు గారి జయంతి వేడుకలు.
ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారకరామారావు గారి 102 వ జయంతి వేడుకలు ఖమ్మం కేంద్రకార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మొదటగా NTR సర్కిల్ వద్దకు చేరుకుని స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి భారీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి పార్టీ కార్యాలయానికి చేరుకుని కార్యాలయంలోని అన్న గారి విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేసారు. తదుపరి కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంచారు, ఈ కార్యక్రమానికి జిల్లా అడహక్ కమిటీ సభ్యులు కొండబాల కరుణాకర్ అధ్యక్షత వహించారు. పలువురు నాయకులు తారకరామారావు గారు చేసిన పలు అభివృద్ధి పధకాలను తమ ఉపన్యాసంలో కొనియాడారు. జాతీయఅధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వం లో తెలంగాణ లో కూడ వచ్చే ఎన్నికలలో కూటమి అధికారంలోకి వస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు మల్లెంపాటి అప్పారావు, జిల్లా నాయకులు వనమా వాసు, మండడపు సుధాకర్, నాగార్జున శ్రీనివాస్, గడిపూడి వెంకటేశ్వరరావు, బోయిన వెంకన్న, రాయలకోటేశ్వరరావు, మందపల్లి కోటేశ్వరరావు, చల్లంగుడ్ల రమేష్, పాలడుగు క్రిష్ణప్రసాద్, కొలికొండ మురళి, నల్లమాస మల్లయ్య, మల్లెంపాటి లహరిన్ , కర్ణాటి అశ్వనీకుమార్, రాజ రాజేశ్వరి చావారామారావు, సామినేని లక్ష్మణ్ రావు, వాసిరెడ్డి భాస్కర్ రావు, మేకల సత్యవతి, తాడిశెట్టి స్వాతి, జాన్బీ, తెగుళ్ల రమణ, అబ్బరపూరి జనార్ధనా చారి, కంచుమర్తి బాబురావు, దొడ్డ కృష్ణారావు, నల్లమోతు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు