క్వారీ గుంట లో చిక్కి వ్యక్తి మృతి

Sep 8, 2024 - 19:02
 0  101
క్వారీ గుంట లో చిక్కి వ్యక్తి మృతి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ మండల పరిధి బొప్పారం లో క్వారీ గుంట లో చిక్కి మరో వ్యక్తి మృతి మృత దేహం అచూకి కోసం రెండు రోజులుగా క్వారీ గుంట లో గాలింపు.. పోలీసులు గజ ఈతగాళ్లు ఫైర్ సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు.. రెండు నెలల క్రితం ఇదే గుంతలో ఈత కు వెల్లి ముగ్గురు మృతి.. ఆత్మకూర్ ఎస్... మండల పరిధిలోని బొప్పారం గ్రామం లో క్వారీ గుంతలో వ్యవసాయ విద్యుత్ మోటర్ తీసేందుకు నీటిలో కి దిగి ప్రమాదవశాత్తు శనివారం వ్యక్తి మృతి చెందాడు. రెండు రోజులు గా మృతదేహం కోసం పోలీసులు గజ ఈతగాళ్లు ఫైర్ సిబ్బంది నీటి గుంటలో వెతుకుతున్న శవం దొరకడం లేదు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోతే మండలం కూడలి తండా కు చెందిన బుక్య బిచ్యా బొప్పారం లో భూమి కౌలు కు తీసుకొని క్వారీ గుంట నుండి వ్యవసాయ మోటారు తో నీళ్ళు పంట పొలానికి వాడుకునే వాడు.ఇటీవల కురుస్తున్న వర్షాలకు క్వారీ గుంతలో భారీగా నీరు చేరడంతో వ్యవసాయం మోటారు నీటిలో మునిగింది. మునిగిన విద్యుత్ మోటార్ ను బయటికి తీసేందుకు అదే తండా కు చెందిన బానోతు హిరా60.ను బిచ్య కూలీ కి తీసుకొచ్చాడు. క్వారీ గుంతలో ఉన్న మోటర్ తీసేందుకు నీళ్లలోకి వెళ్లిన హీరా మోటార్కు తాడుకట్టి బయటికి రాలేదు. బయట ఉన్నవారు తాడు సహాయంతో మోటర్ బయటికి తీసినప్పటికీ మోటర్ తీసేందుకు వెళ్లిన హీరా బయటికి రాకపోవడంతో రాళ్ళలో ఇరుక్కుపోయి ఉండవచ్చు నని పోలిసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సైదులు తమ సిబ్బందితో శనివారం సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని బయటికి తీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఏ ఒక్కరు గుంతలోకి వెళ్లడానికి నిరాకరించారు. మృతుడు బానోత్ హీరా మృతి కి నీవే కారణమంటూ మృతుని కుటుంబ సభ్యులు బిచ్చు పై దాడికి పాల్పడ్డారు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదే గుంతలో గత రెండు నెలల క్రితం ఈత కని వెళ్లి ముగ్గురు మృతి చెందిన సంఘటన నుండి మరువకముందే మరో వ్యక్తి గుంత లో పడి మృతి చెందడం తో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. శనివారం మధ్యాహ్నo సంఘటన జరిగిన కానుండీ సూర్యాపేట dsp రవి రూరల్ సీఐ స్థానిక ఎస్ ఐ సైదులు క్వారీ గుంత లో మృత దేహం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా మృత దేహం అభించలేదు. సీసీ కెమెరాల సహకారంతో సుమారు మూడు గంటల ప్రయత్నించినప్పటికీ లభించలేదు. ఆదివారం సాయంత్రం ఫైర్ ఇంజన్ సిబ్బంది నీటిని తోడి ఎయిర్ ద్వారా శవాన్ని గుర్తించేందుకు చేశారు సాయంత్రం వరకు మృత  దేహం ఆచూకీ లభించలేదు. అయినప్పటికీ అధికారులు శవం కోసం ముమ్మరగాలింపు చర్యలు చేపడుతున్నారు...