క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క

Dec 25, 2024 - 18:43
Dec 25, 2024 - 18:57
 0  12
క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క

క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క

ములుగు డిసెంబర్ 25 తెలంగాణ వార్త:- ములుగు జిల్లా కేంద్రములోనీ ఓలి మిని స్ట్రీట్ చర్చి లో మరియు లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్కఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా ఏసుక్రీస్తు బోధనలైన స్వార్థ రహిత జీవనం, ప్రేమా, దయ, ఎదుటి వారిని క్షమించే గుణం, తమకు ఉన్న జ్ఞానాన్ని పంచుకోవడం ఇవి ఏసు బోధనలు అని శాంతి సౌభ్రాతృత్వన్ని పంచే క్రీస్తు బోధనలు యధాతధంగా ఎంత గొప్పగా ప్రచారంలోకి వస్తే ఈ ప్రపంచానికి అంత గొప్ప మేలు జరుగుతుంది అని మంత్రి వర్యులు సీతక్క  అన్నారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ కేక్ కట్ చేసిన మంత్రి సీతక్క  చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్