కోదాడలో జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించారు.

Aug 6, 2024 - 19:05
Aug 6, 2024 - 19:47
 0  46
కోదాడలో జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించారు.

కోదాడ 7 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని జాతీయ రహదారి బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా మెయిన్ రోడ్ లో గల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రూపకర్త శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి కోదాడ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కోదాడ  స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు. ప్రముఖులు మాట్లాడుతూ,జయశంకర్ సార్ ఉద్యమస్ఫూర్తిని, విద్యార్థుల ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, రాయపూడి వెంకటనారాయణ, వీరభద్రా చారి, నరసింహారావు చారి, వెంకటాచారి, పంది తిరుపతయ్య ,కాజా, మార్కండేయ, బడుగుల సైదులు, పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333