కొత్త కొత్తూరులో ప్రజా ప్రభుత్వంలో అర్హులకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి శంకుస్థాపన""వ్యవసాయం మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు లో ప్రజా ప్రభుత్వం లో అర్హులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఇటీవల రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సూచనతో లబ్ధిదారులకు అందించారు.లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు భూమి పూజ చేశారు.తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం పట్ల లబ్దిదారులు మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేశారు. ఈసందర్భంగా వెన్నపూసల సీతారాములు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న సొంత ఇంటి కల ఇందిరమ్మ ప్రభుత్వం లో నెరవేరిందన్నారు.వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరైన వారు పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శాఖమూరి రమేష్, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొడాలి గోవింద రావు,వల్లాల రాధాకృష్ణ,ఎండీఓ ఎర్రయ్య,పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు*