కూలిన బ్రిడ్జి ప్రమాదాలకు నిలయం
జోగులాంబ గద్వాల 8 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల . మండలం పరిధిలోని మునగాల గ్రామ శివారులో కూలిన పి జె పి కుడి కాలువ వంతెన ప్రమాదాలకు నిలయంగా మారిందని సానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వంతెన కూలి 10 నెలలైనా మరమ్మతులకు నోచుకోవడం లేదని స్థానికులువాపోతున్నారు.ఫలితంగా వ్యవసాయ రైతులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి అన్నారు.ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్నారని పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.