కిడ్నీ రాకెట్ ఆట కట్టించిన కోదాడ పోలీసులు"" ఏపీలోనే విజయవాడ కేంద్రంగా సాగుతున్న కిడ్నీ దందా

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : కిడ్నీ రాకెట్ ఆటకట్టించిన కోదాడ పోలీసులు..
ఆంధ్రపదేశ్ లోని విజయవాడ కేంద్రంగా సాగుతున్న కిడ్నీ దందా....
చట్టవిరుద్ధంగా కిడ్నీ మార్పిడి చేస్తున్న పది మంది సభ్యులు గల ముఠా...
డయాలసిస్ రోగులే లక్ష్యంగా దందా....
కిడ్నీ మార్పిడికి కావాల్సిన సర్టిఫికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికి బాధితుల నుంచి డబ్బు వసూలు...
కోదాడకు చెందిన నరేష్ అనే డయాలసిస్ రోగికి విజయవాడలో ఆపరేషన్...
బాధితుడి నుంచి రూ 22 లక్షలు కాజేసిన ముఠా...
ఆస్పత్రి బిల్లు చెల్లించక పోవడంతో వెలుగులోకి వచ్చిన దందా....
బాధితుడి పిర్యాదు తో ఆరుగురు ముఠా సభ్యులు అరెస్ట్,పరారీలో మరో నలుగురు....
ఇప్పటివరకు ముఠా సభ్యులు 10 కిడ్నీల మార్పిడి చేసినట్టు పోలీసుల గుర్తింపు...