కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం

:ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

Mar 30, 2024 - 01:04
Mar 30, 2024 - 01:07
 0  6
కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం

శేరిలింగంపల్లి (మార్చ్ 29) తెలంగాణవార్త :-  తెలంగాణ భ‌వ‌న్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం విస్తృత స్థాయి స‌మావేశంలో  బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు  కేటీఆర్, ఎమ్మెల్సీ దాయనంద్ గుప్తా,ఎమ్మెల్యేలు సబితా  ఇంద్రారెడ్డి , కాలే యాదయ్య , డాక్టర్ సంజయ్ , మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి , మెతుకు ఆనంద్ , పైలెట్ రోహిత్ రెడ్డి , చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, శేరిలింగంపల్లి నియోజకవర్గం  ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ  పాల్గొని ప్ర‌సంగించారు.ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్  గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో  బిఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని,ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇస్తామన్నారు.పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుండి పోటీ చేస్తున్నారని ఆ ఇద్దరిని ఓడించటానికి  ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుందని,కేసీఆర్ గారిని ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే గాంధీ  పేర్కొన్నారు.  అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రజలలోకి వెళ్లాలని, ప్రతి గడప గడప కి వెళ్లి తెలంగాణ మాజీ సీఎం  కేసీఆర్  చేసిన అభివృద్ధి ని వివరిస్తూ ఓట్లు అడుగుదాం అని ఎమ్మెల్యే  తెలియచేసారు. కేసీఆర్  బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారని  బీసీ అభ్యర్థి  కాసాని జ్ఞానేశ్వర్ నిలబెట్టడం జరిగినది అని ఎమ్మెల్యే గాంధీ  తెలియచేసారు. అందరూ కలిసి కట్టుగా పనిచేసి ,సమిష్టి కృషి తో పని చేద్దాం అని ఎమ్మెల్యే గాంధీ  పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు  రాగం నాగేందర్ యాదవ్,నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ , సింధు ఆదర్శ్ రెడ్డి,మంజుల రఘునాథ్ రెడ్డి, మాధవరం రోజాదేవి రంగారావు ,మాజీ కార్పొరేటర్ సాయి బాబా , బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు , తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333