కాసాని ఐలయ్య స్ఫూర్తితో భూమి పోరాటాలు చేస్తాం

Feb 4, 2025 - 19:59
 0  9
కాసాని ఐలయ్య స్ఫూర్తితో భూమి పోరాటాలు చేస్తాం

             

చర్ల: ఫిబ్రవరి 4,2025, మంగళవారం: బ్రతికినంత కాలం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన గొప్ప ప్రజానాయకుడు కాసాని అయిలయ్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు కొనియాడారు, మంగళవారం నాడు బందెల చంటి అద్యక్షతన జరిగిన సంస్మరణ సభ లో సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలగాని బ్రహ్మచారి,రేపాకుల శ్రీనివాస్ లు పాల్గొన్నారు, ఈ సందర్భంగా కాసాని అయిలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక భూమి,కూలి పోరాటాలునిర్వహించిన చరిత్ర కాసాని దన్నారు,పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప కమ్యూనిస్టు నాయకుడన్నారు,సుజాతనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ప్రజలకు సేవ చేసి వారి మన్ననలు పొందాడన్నారు, కాసాని అయిలయ్య స్పూర్తితో విప్లవ కార్యాచరణలో సిపిఎం కార్యకర్తలు కదిలి వచ్చి ప్రజా సమస్యల పై పోరాటాలు ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మచ్చ రామారావు, సిపిఎం మండల కమిటీ సభ్యులు బందెల చంటి,పొడుపుగంటి సమ్మక్క,పామర్ బాలాజీ సింగ్,తాటి నాగమణి,ఉడుగుల షారోణి, దొడ్డి హరినాగ వర్మ, శ్యామల చంద్రం,వరదల వరలక్ష్మి, శాఖ కార్యదర్శులు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.