కామ్రేడ్ జెన్ను జలగం జనార్థన్ 4 వ వర్ధంతి సభ

May 21, 2025 - 20:06
May 21, 2025 - 20:08
 0  20
కామ్రేడ్ జెన్ను  జలగం జనార్థన్  4 వ వర్ధంతి సభ

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ : ప్రతిఘటన పోరాట వెలుగులో పోరు చేసిన జలగం జనార్ధన్ సిపిఐ(ఎం.ఎల్ )న్యూ డెమోక్రసీ ఏపూరి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జెన్ను 4 వ వర్ధంతి సభను న్యూ డెమోక్రసీ డివిజన్ కమిటీ సభ్యుడు కంచన పెళ్లి సైదులు అధ్యక్షతన నిర్వహించడమైనది. . ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన పి ఓ డబ్ల్యు జాతీయ కన్వీనర్ కామ్రేడ్ జి ఝాన్సీ పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా విప్లవ ఉద్యమంలో కామ్రేడ్ జెన్ను పాత్ర మరువలేనిది అన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జన్నన్నఉండే వాడని ప్రజలకు, కార్యకర్తలకు భరోసా కల్పించేవాడు అన్నారు. ప్రతిఘటన పోరాటా లైన్ ను ముందుకు తీసుకు పోవడంలో శక్తి వంచనలేకుండా కృషి చేశాడు అన్నారు. గ్రామాలలో భూస్వామ్య విధానాలను, పెత్తందారీ విధానాలను ఎండ గట్టే వాడన్నారు. జన్నన్న దోపిడీ, పీడన, అణిచివేతలు లేని రాజ్యం కై పోరాడడని అలాంటి సమాజం కొరకు పోరాడాలన్నారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి కోటేశ్వరరావు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ మాట్లాడుతూ జన్నన్న మన ముందు లేకపోయినా చివరివరకు ఎలాంటి సమాజం కావాలని కలలు కన్నాడో అది ఏర్పడడానికి పోరాటాలను తీవ్రతను చేయాలన్నారు. కరోనా పేరుతో లాక్షలాది మందిని హత్య చేయడం దుర్మార్గమన్నారు. నక్సలైట్ల సమస్య రాజకీయ సమస్య,ఆర్థిక సమస్య తప్ప శాంతి భద్రతల సమస్య కాదన్నారు. నక్సలైట్లు ఎవరు అనుకూలంగా మాట్లాడిన అరెస్టు చేయడము, చంపడం నేడు జరుగుతుందన్నారు. సమస్యలు ఉన్నంతకాలం నక్షలిజం సజీవంగా ఉంటుందన్నారు. ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటాలు జరుగుతాయని, వాటిని ఆపడం ఎవరి తరం కాదన్నా కామ్రేడ్ జనార్ధన్ అన్న తన 14 సంవత్సరాల రహస్య జీవితంలో ఏనాడు భయపడలేదని అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి మునుముందుకు సాగిన గొప్ప త్యాగ ధనుడన్నారు. పోరాటాలు మరింతగా తీవ్రతరం చేసినప్పుడే కామ్రేడ్ జన్నాన్నకిచ్చే నిజమైన నివాళులు అన్నారు. . ఇంకా ఈ సభలో ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్, ఏ ఐ కె ఎం ఎస్ డివిజన్ కార్యదర్శిఅల్గుబెల్లి వెంకటరెడ్డి, జెన్ను జీవిత సహచరణి కలమ్మా, పార్టీ డివిజన్ నాయకులు ఎస్ కె జిలేరు,, సబ్ డివిజన్ నాయకులు బండి రవి,, గ్రామ కార్యదర్శి సుధాగాని వెంకన్న,పి వై ఎల్ జిల్లా ఆధ్యక్షులు నల్లగొండ నాగయ్య, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నర్సమ్మ, ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే మైబెల్లి,సంజీవరెడ్డి,బోల్క పవన్, డేగల వెంకటకృష్ణ,, తదితరులు పాల్గొన్నారు.