కామ్రేడ్స్ మల్లోజుల, తక్కినపల్లి మిగతా క్యాడర్ కామ్రేడ్స్ నిర్ణయం సరైందే

యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ బోర్డ్ మెంబర్ గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి

Oct 29, 2025 - 10:37
 0  6
కామ్రేడ్స్ మల్లోజుల, తక్కినపల్లి  మిగతా క్యాడర్ కామ్రేడ్స్ నిర్ణయం సరైందే

మావోయిస్టు పార్టీ నుండి సరెండర్ అయినా మల్లోజుల వేణుగోపాల్ మరియు తక్కినపల్లి వాసుదేవరావు మరియు మిగతా క్యాడర్ కామ్రేడ్స్ యొక్క నిర్ణయం సరైందే అని యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ బోర్డ్ మెంబర్ గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మావోయిస్టు పార్టీ అధినేత బిఆర్ దాదా ఉన్నప్పుడే శాంతి చర్చలకు అనువైన వాతావరణం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాలను కోరిన వీడియో ఆధారంగానే ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నామని చెప్పారు. 

ఒకవేళ ఇది తప్పు నిర్ణయమే అయితే ఆరోజు మాట్లాడని, ఏ నోరు, ప్రజా సంఘాలు, మీడియాలు, ఇవాళ దేశంలో శాంతియుత వాతావరణాన్ని నిలపడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఖండించడం మూర్ఖపు చర్య అని గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు.

కేంద్ర కమిటీ సభ్యులు మరియు మావోయిస్టు పార్టీ అధినేత బి ఆర్ దాదా ఉన్నప్పుడే ఈ యొక్క విషయాన్ని బెస్తర్ టాకీస్ మాధ్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సందేశాన్ని మావోయిస్టు పార్టీ ఇచ్చిందని, ఆరోజు ఏ అభ్యంతరం తెలపని వారందరూ ఇప్పుడు అభ్యంతరం తెలపడం విచిత్రంగా, విడ్డూరంగా, ఉందని అన్నారు.

సిద్ధాంతాన్ని బతికించుకోవడానికి మరియు నమ్మిన వారిని కాపాడుకోవడానికి పరిస్థితి ప్రభావాన్ని బట్టి ముందుకు వెళ్ళడానికి తీసుకున్న నిర్ణయం సరైనదే అని దేశంలో ఉన్న ప్రజలు 90 శాతం మంది మద్దతిస్తున్నారని ఆయన తెలిపారు. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఉన్నతమైన సేవ అందించే రంగం రాజకీయ రంగమని ఎటువంటి మార్పునైనా దేశంలో తీసుకురావాలంటే కేవలం అది రాజకీయంతోనే సాధ్యమని ఇట్లాంటి పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్లి నిలబడి సాధించాలనే నిర్ణయం సరైనదే అని, మూర్ఖంగా నిలబడి ప్రాణాలు కోల్పోవడం కన్నా నమ్మిన వారిని ప్రాణాలను,పణంగా పెట్టి ముందుకి నడవడం కన్నా మనల్ని నమ్ముకున్న వారందరినీ కాపాడుకొని వారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే విధంగా జనంలో ఉంటూ జనంతో ముందుకి సాగాలనే నిర్ణయం నూటికి నూరు శాతం సరైన నిర్ణయమని దీన్ని దేశంలో ప్రజలు ఎవరు తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థితులను చూసుకుంటే ఎవరి అండదండ లేకుండా ప్రజలు వారి వారి హక్కుల కోసం పోరాడుతున్నారని వారితో కలిసి ముందుకు వెళ్లడం వల్ల విజయాలు సాధిస్తామని జరుగుతున్న పరిస్థితులు బట్టి అర్థమవుతుంది, ఒకసారి చూసుకుంటే నేపాల్ లో జరిగిన సంఘటనలు మరియు బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఆ దేశపు యువత ముందుకు వచ్చి అల్లర్లు చేసి వారికి కావాల్సిన వారికి నచ్చిన రాజ్యం ఏర్పాటు చేసుకున్నారని ఏ ఒక్కరు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాయుధ బలగాలతో ముందుకు వెళ్లే విధంగా ఆలోచించట్లేదని ఒక్కసారి మేధావి వర్గం అంతా కూడా దీనిపై ఆలోచించాలని ప్రజలకు కావాల్సింది ప్రజలతో చర్చించి ముందుకు వెళ్లే విధంగా ఆలోచించాలని ఆయన కోరారు. 

రాజ్యస్థాపనకై ఎందరో కామ్రేడ్లు అమరులయ్యారని ఎంతోమంది మేధావులను ఇప్పటికే మనం పోగొట్టుకున్నామని ఉన్న వారిని కూడా పోగొట్టుకుంటే దేశంలో జరిగేది రాజహింసేనని, కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ విధంగా ముందుకు వెళ్లి తరువాతి కార్యాచరణను రూపుదిద్దుకొని ముందుకు వెళ్లాలని సూచించారు, అలాగే మన భారతదేశంలో, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, బీహార్ లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా చార్ మజుందార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి వారు తీసుకున్న మార్గమే ఇప్పుడు మావోయిస్టు పార్టీ,తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి తప్పిదం లేదని అజ్ఞాతంలో ఉన్న మిగతా వారు కూడా ఆలోచించి ప్రజా శ్రేయస్సు కొరకు ప్రజా సమస్యల కొరకు పోరాటాలను ముందుకు తీసుకెళ్లే విధంగా జనంతో కలిసి జనంలో ఉండి ముందుకు వెళ్లే నిర్ణయం సరైనదని ఆ విధంగా చేయడం వల్ల దేశంలో శాంతి నెలకొంటుందనీ, సమస్యలను ఏ విధమైన కార్యాచరణతో రూపుమాపాలనేది ప్రణాళికను సిద్ధం చేసుకుని రాజ్యాంగబద్ధంగా రాజకీయంగా శాశ్వత పరిష్కారాన్ని ఏర్పాటు చేసే విధంగా ముందుకెళ్లాలని యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ బోర్డు మెంబర్ గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333