కంపెనీ స్థలాలను పత్రాలపై పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మందుల సామేలు

Nov 10, 2024 - 07:04
Nov 10, 2024 - 21:12
 0  14
కంపెనీ స్థలాలను పత్రాలపై పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మందుల సామేలు

డి రేపాక గ్రామంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ భూమిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మందుల సామేల్

అడ్డగూడూరు 09 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- పలు కంపెనీల ప్రతినిధులతో అడ్డగూడూరు ప్రాంతంలో పరిశ్రమల స్థాపనతో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శనివారం అడ్డగూడూరు మండల పరిధిలోని డీ.రేపాక గ్రామంలో పరిశ్రమల స్థాపనకై పలు కంపెనీల ప్రతినిధులతో కలిసి సర్వే నెంబర్ 165 గల ప్రభుత్వ భూమిని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ సహకారంతో పరిశ్రమల ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోలేబోయిన లింగయ్య యాదవ్,సింగిల్ విండో చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,మండల కాంగ్రెస్ నాయకులు విద్యాసాగర్, పరశురాములు,కొండంపేట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.