ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి... జిల్లా ఎన్నికల అధికారి బి. యం. సంతోష్ 

Jun 3, 2024 - 20:22
 0  2
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి... జిల్లా ఎన్నికల అధికారి బి. యం. సంతోష్ 

 నగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్లు గద్వాల, అలంపూర్ పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి బి. యం. సంతోష్ తెలిపారు.

 నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదాములో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నామన్నారు.  మంగళవారం ఉదయం 8:00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా కౌంటింగ్ సిబ్బందికి అన్నివిధాలుగా సన్నద్ధం చేశామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఇప్పటికే పలు విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహించి అవగాహన కల్పించామని అన్నారు. ఎలాంటి పొరపాట్లు, గందరగోళానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం కూడా ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. పోలైన ఓట్ల లెక్కింపు కోసం  గద్వాల సెగ్మెంట్ కు 16, అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ కు 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశామన్మారు.  18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని, మధ్యాహ్నం 3.00 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.  ఎలాంటి గందరగోళానికి తావులేకుండా పక్కాగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. 

   జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, ఆర్డీవో రాంచందర్, గద్వాల్, అలంపూర్ తాసిల్దార్లు ఎన్నికల విభాగం తహసీల్దార్ నరేష్  తదితరులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333