ఒక ప్రాణం ఖరీదు అరవై వేల రూపయల.?
*ప్రాణం ఖరీదు అరవై వేలు*..
*సూర్యాపేట లో ఠాగూర్ సీన్ రిపీట్*
*చనిపోయిన పేషెంట్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం*
*ప్రభుత్వ వైద్యాన్ని కించపరిచే ప్రయత్నం చేసిన ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు*
*ప్రవేట్ హాస్పటల్స్ పై చర్యలు తీసుకొని అధికారులు, నాయకులు*
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఠాగూర్ సినిమాలోని సీన్ ను రిపీట్ చేసింది. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి మొదట ఓ ఇంజక్షన్ వేసి అపస్మార్క స్థితిలోకి తీసుకెళ్లిన సిబ్బంది అనంతరం మరో ఇంజక్షన్ వేసి. అతని మృతికి కారణమయ్యారు. ఈ విషయం మృతుని బంధువులకు తెలిసేలోపు మృతుని అంబులెన్స్ లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి అక్కడే చనిపోయినట్లు ప్రభుత్వ వైద్య0 పై నెట్టేందుకు ప్రయత్నం చేశారు. మృతి చెందిన వ్యక్తిని బంధువులకు సైతం సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించడం వెనుక ఆంతర్యం ఏమిటని బంధువులు ప్రశ్నించడంతో ఆస్పత్రి నిర్వహకులు నీళ్లు మింగిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన శివరాత్రి ఇద్దయ్య, 62 సంవత్సరాల వయస్సు జమ్మిగడ్డలో ని హెల్తీ పై ప్రైవేట్ ఆసుపత్రిలో మోకాలి నొప్పి చికిత్స కోసం చేరాడూ. అయితే ఆసుపత్రి సిబ్బంది పేషెంట్ కు మొదట ఒక ఇంజక్షన్ వేయడంతో అపస్మాక స్థితిలోకి వెళ్ళాడు. దీంతో ఏదో జరుగుతుందని గమనించి మరో ఇంజక్షన్ వేయడంతో రోగి మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆసుపత్రి నిర్వాహకులు కప్పిపుచ్చుకునేందుకు ఠాగూర్ సీన్ ను క్రియేట్ చేశారు. బంధువులకు సమాచారం ఇవ్వకుండా చనిపోయిన పేషెంట్ ను సైలెంట్ గా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కి తరలించారూ. తమకు చెప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కు మృతున్ని తరలించారని ఆస్పత్రి సిబ్బంది వేసిన ఇంజక్షన్ల వల్లనే రోగి మృతి చెందాడని దీని కప్పిపోవచ్చినందుకు ఏరియా ఆసుపత్రికి తరలించారని రోగి బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు.