ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భద్రగిరి మార్ట్ లో పాఠశాలలకు ఉపయోగపడేఅన్ని వస్తువులు సరసమైన ధరలకు లభించును. పి ఓ బి రాహుల్
తెలంగాణ వార్త జూన్08 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : భద్రాచలం పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా భద్రాచలం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ లో అన్ని పాఠశాలలకు సంబంధించిన అన్ని రకాల నోట్ బుక్స్ సరసమైన ధరలకు భద్రగిరి మార్ట్ లో అందుబాటులో ఉన్నాయని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
నోట్ బుక్స్ తో పాటు జామెంట్రీ బాక్సులు ఇతర పాఠశాలలకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు లభించునని పిల్లల తల్లిదండ్రులు ఇట్టి విషయాన్ని గమనించి భద్రగిరి మార్ట్ లో తక్కువ ధరలకు లభించే పాఠశాలలకు సంబంధించిన నోట్ బుక్స్ ఇతర మెటీరియల్స్ కొనుగోలు చేసి భద్రగిరి మార్ట్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు.