ఏఈఓ పైన అలాగే మండల వ్యవసాయ అధికారి పైన సమగ్ర విచారణ జరిపించాలి.

Feb 24, 2024 - 19:07
 0  6
ఏఈఓ పైన అలాగే మండల వ్యవసాయ అధికారి పైన సమగ్ర విచారణ జరిపించాలి.

PDSU రాష్ట్ర నాయకుడు హలీం పాషా.

జోగులాంబ గద్వాల 24 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గట్టు.. 36 లక్షల రైతుబంధు స్వాహా నిధులను పక్కదారి పట్టించిన ఏఈఓ పైన అలాగే మండల వ్యవసాయ శాఖ అధికారి పైన  సమగ్రమైన విచారణ దర్యాప్తు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ADO గోవింద్ నాయక్ కి PDSU ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు


 ఈ సందర్భంగా PDSU రాష్ట్ర నాయకుడు హాలింపాషా మాట్లాడుతూ
➖  జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బలిగెర AEO గా నిధులు నిర్వహిస్తున్న అధికారి 36 లక్షల పక్కదారి పట్టించి బినామీ బ్యాంక్ ఖాతాలో జమ చేసుకోవడం అలాగే మండల వ్యవసాయ శాఖ అధికారి గట్టు మండల ప్రజల అందుబాటులో లేకుండా ఉండడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు
➖ 64 మంది రైతులకు సంబంధించిన రైతుబంధు డబ్బులు పూర్తిగా బినామీ చేతిలో వెళ్లినట్లు  రైతులకు  రావలసిన రైతుబంధు నిధులు పూర్తిగా పడకపోవడం జరిగింది. కావున వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు రైతు బందు కేటాయించాల్సిందిగా కోరారు రైతులకు న్యాయం చేయాలని అన్నారు 

➖ ఇలాంటి సంఘటనలు ఇంకా ఏ గ్రామంలో అయినా జరిగి ఉంటే మండలం మొత్తం పూర్తిగా సమగ్రమైన విచారణ చేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా వ్యవసాయ శాఖ అధికారులను కోరారు కార్యక్రమములో ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333