ఎంతోమందికి పునర్జన్మనిస్తున్న ప్రాణదాత కటుకం గణేష్

Mar 11, 2025 - 19:24
 0  2

మనిషికి జన్మనిచ్చేది అమ్మ - పునర్జన్మ నిచ్చేది రక్తదాత...

 యువకుల్లో రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించిన కటుకం గణేష్..

4250 పైగా రక్తదాతలను సేకరించిన గణేష్.

 17 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కటుకం గణేష్..

 రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉమ్మడి జిల్లా ఉత్తమ సామాజిక సేవకుడిగా అవార్డు గ్రహీత...

 సామాజిక సేవకుడు, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ...

యువతలో రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. ఇప్పటివరకు మరికొంత యువతలో ఇంకా అపోహాలు తొలగి పోలేవు రక్తదాన ఆవశ్యకతను వివరించి రక్తదాతలను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రభుత్వ పక్షాన కూడా కార్యక్రమాలు గణేష్ నిర్వహించారు. గత 17 సంవత్సరాలలో నా విన్నపానికి స్పందించి సకాలంలో రక్తదానం చేసిన దాతలు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు...

 నా ఆలోచన కటుకం గణేష్..

నా ఆలోచనకనుగుణంగా ముందడుగు వేసిన యువజనుల, స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలు మరువరానిది...

ప్రాణాలు నిలిపేది రక్తదానం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించేది రక్తం...

అందుకే రక్తదానాన్ని ప్రాణదానంతో సమానమంటారు....

 ప్రాణాలు పోసే శక్తి మనకు ఉందా..?

అంతా దైవదీనం...

అంటూ ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని చూసి నిట్టూరిస్తాము. కానీ ఒక రకంగా ప్రాణం పోసే శక్తి వైద్యులకే కాదు మనకు కూడా ఉందనే విషయాన్ని విస్మరిస్తున్నాము...

రక్తదానంతో ఎందరికో జీవితాలను ఇవ్వగలరని, మరెందరికో పునర్జన్మను కల్పించే అవకాశం ఒక రక్తదాతకే ఉందనే విషయాన్ని యువతరం గుర్తుంచుకోవాలి.

రక్తదానంపై నానాటికి యువతలో సరైన అవగాహన లేకపోవడం రక్తదానంపై భయానికి గురవడం ఇంకా ఉంది.

కనుకనే ఇప్పటికీ అత్యవసర సమయాలలో సకాలంలో రక్తం అందక ఎందరో మృత్యువాతకు గురవుతున్నారు.

రక్త నిధి కేంద్రాలలో సైతం రక్తం అందుబాటులో రక్తం లేకపోవడంతో అత్యవసర శాస్త్ర చికిత్సల సమయాలలో వైద్యులు సైతం శాస్త్ర చికిత్స చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు.

మరి అంతటి మహోన్నత రక్తదానంపై యువతలో అవగాహన కల్పిస్తూ గత 17 సంవత్సరాలలో వేలాదిమంది యువతతో రక్తదానం చేయించి రక్తదాన సంధానకర్తగా ముందుకు సాగుతున్నాను...

 కటుకం గణేష్ గురించి...

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత, కోరుట్ల సిటీ కేబుల్ రిపోర్టర్ కటుకం గణేష్ 2007 సంవత్సరంలో కోరుట్ల పట్టణంలో ఓ ప్రైవేట్ హాస్పటల్లో ప్రసవ సమయంలో మహిళకు సకాలంలో రక్తం అందక కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రత్యక్షంగా అక్కడే ఉన్న కటుకం గణేష్ చలించి వెంటనే ఓ మిత్రునితో రక్తదానం చేయించి తల్లి బిడ్డల సుఖ ప్రసవానికి దోహదపడ్డారు.

ఇలాంటి అత్యవసర సందర్భాలలో రక్తదాతలు అందుబాటులో ఉంటే ఎవరి ప్రాణాలైనా కాపాడవచ్చునే ఆయనలో ఆలోచన...

 బీజం పడింది ఇక్కడే...!

తన ఆలోచనకనుగుణంగా ప్రణాళిక రూపొందించుకున్న గణేష్ పట్టణంలోని యువజన, స్వచ్ఛంద సంస్థల సభ్యులను కలిసి రక్తదానంలో వారి బాగస్వామ్యతను తెలియపరిచారు.

గణేష్ ఆలోచనల కనుగుణంగా పట్టణంలోని యువజన సంఘాల సభ్యులు తమ తమ రక్త నమూనా వివరాలను ఆయనకు అందించారు.

రక్తనమూనాలు తెలియని వారికి ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ సహకారంతో రక్త నమూనా పరీక్షలు నిర్వహించారు. ఇలా ఇప్పటివరకు వందలాది మంది రక్త నమూనాల వివరాలను వారి ఫోన్ నెంబర్లను సేకరించుకున్న గణేష్ నాటి నుండి నేటి వరకు ఎక్కడ రక్త దాతల విషయంలో వెనకంజ వేయలేదు. గణేష్ విన్నపానికి స్పందించిన ఎందరో యువకులు రక్తదానంపై అవగాహన కల్పించుకుని స్వచ్ఛందంగా రక్తదానంపై తమ సుముఖతను తెలియపరుస్తూ తమ వివరాలను గణేష్ కు అందించారు అంతేకాకుండా అత్యవసర శాస్త్ర చికిత్సల సమయంలో, ప్రసవాల సమయంలో కూడా ప్రాణదాతలయ్యారు.

ఈ ఉద్యమం కోరుట్ల పట్టణానికి పరిమితం కాకుండా జగిత్యాల, కరీంనగర్, మెట్ పల్లి, ఆర్మూర్, హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు సైతం గణేష్ విన్నపంతో రక్తదానం చేసిన దాతలు కోకొల్లలు...

ఇలా 2007 సంవత్సరంలో కటుకం గణేష్ ప్రారంభించిన ఈ రక్తదాన ఉద్యమం గడిచిన 17 సంవత్సరాల కాలవ్యవధిలో పలు యువజన, స్వచ్ఛంద దాతల సహకారంతో సుమారు 4250 మందికి పైగా రక్త దానాలు పూర్తయ్యాయంటే ఇదొక్క అసాధారణ కార్యక్రమం అని అనుకోక తప్పదు.

ఇంతటి ఆసాధారణ కార్యక్రమాన్ని చేపట్టి రక్తదాన సంధానకర్తగా, ప్రాణదాతగా తన ఆశయాన్ని నెరవేర్చుకున్న కటుకం గణేష్...

సామాజిక దృక్పథానికి చిహ్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా-2015 సంవత్సరంలో ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుతం ఎంపీ ఈటెల రాజేందర్ చేతుల మీదుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉత్తమ సామాజిక సేవకుడిగా -2015 లో అవార్డును అందుకున్నారు.

అలాగే ప్రొఫెసర్ జయశంకర్ స్మారక రాష్ట్రస్థాయి పురస్కారం, కాళోజీ పురస్కారం, గ్రామీణ కళాజ్యోతి జీవిత సాఫల్య పురస్కార్ అవార్డు, కోరుట్లకు చెందిన ఈ తరం యూత్ ద్వారా బెస్ట్ బ్లడ్ మోటివేటర్-2010 అవార్డు, జగిత్యాల కళాశ్రీ వారిచే రాష్ట్రస్థాయి అవార్డు, కోరుట్లకు చెందిన శాంతి యూత్ ద్వారా సామాజిక సేవకుడిగా ఉగాది పురస్కారం, రక్తదానంపై విశేష కృషి చేస్తూ యువతలో అవగాహన కల్పించినందుకు ఐ.బి యూత్ వారి ఆధ్వర్యంలో సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు పురస్కారం అందుకున్నారు.

అలాగే కేరళ హై స్కూల్ వారి ఆధ్వర్యంలో సినీ నటుడు శివారెడ్డి చేతుల మీదుగా జీవిత సాఫల్య పురస్కార్ అవార్డు అందుకున్నారు.

మెట్ పల్లి స్నేహాలయ యూత్ ద్వారా రక్తదాన అవార్డు, జగిత్యాల జిల్లా యువజన సంఘాల సమితి ద్వారా రాష్ట్రస్థాయి అవార్డు, ఆహా ఫౌండేషన్ ద్వారా సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు.

కోరుట్ల ఒకినోవ మార్షల్ ఆర్ట్ వారి ద్వారా రాష్ట్రస్థాయి అవార్డు, తెలుగు వెలుగు ఫౌండేషన్ ద్వారా జాతీయ మహానంది అవార్డును-2022 వేములవాడలో అందుకున్నారు.

అంజలి మీడియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జాతీయ సేవా రత్న--2023 అవార్డు, జీర్డ్స్ సేవా పురస్కార్--2024 అవార్డు, తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్, పెన్షనర్ అసోసియేషన్ వారు విశిష్ట రక్తదాన సంధానకర్త అవార్డు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక పురస్కార్--2024 అవార్డు, అందుకున్నారు.

అంజలి మీడియా గ్రూప్ వార్షికోత్సవం సందర్భంగా హనుమకొండలో జాతీయ రత్న--2024 రాష్ట్రస్థాయి అవార్డు, అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ లెజెండరీ 2024 రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్నారు.

అంతేకాకుండా ఇలా చెప్పుకుంటూ పోతుంటే కోరుట్ల పట్టణంలో రక్తదానంలో చేస్తున్న కృషిని గుర్తించి మరెన్నో అవార్డులు కటుకం గణేష్ కు వివిధ ప్రముఖులచే, స్వచ్ఛంద సంస్థలచే, యువజన సంఘాలచే, ఇలా ఎన్నో ఎన్నెన్నో అవార్డులను, ప్రశంసలను, పురస్కారాలను గణేష్ అందుకున్నారు.

 *ప్రజల మాట.ప్రముఖుల మాట. ప్రతి ఒక్కరి నోట..!* 

ఇంకా అదే ఉత్సాహంతో ఇప్పటివరకు కూడా సేవా రంగంలో ముందు నిలవడం నిజంగా గర్వకారణం...

సాధించాలనే తాపత్రయం ఉంటే అద్భుతాలు సృష్టించగలం అనే నానుడికి తగినట్లు గణేష్ కార్యాచరణ వేలాదిమందికి ప్రాణాలు పోసిందంటే గణేష్ యొక్క కృషి,పట్టుదలను ఈ సందర్భంగా ఆయనను మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే...

ప్రత్యేకంగా పురస్కారాలు, ప్రశంసాలు, సన్మానాలు కన్నా గొప్పగా ప్రాణాపాయ స్థితిలో అత్యవసర సమయాల్లో సమయానికి రక్తాన్ని ఏర్పాటు చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడి వారి కుటుంబ సభ్యుల గుండెల్లో చిరకాలంగా నిలిచిపోయారు అనడానికి ఎలాంటి సందేహం లేదు...

 *-: ఈ ఇంటర్వ్యూలో సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ మాట్లాడుతూ...* 

ఒక మనిషికి అమ్మ జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తాడు...

కాబట్టి ప్రతి యువత వయసుతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన యువకుల నుండి 50 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు రక్తదానం చేయొచ్చు దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు రక్తదానం చేసి మరో ప్రాణాన్ని కాపాడి ప్రాణదాతగా నిలబడి మీ జీవిత ద్యేయాన్ని సాధించాలని నా విన్నపానికి స్పందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన రక్తదాతలకు మనస్ఫూర్తిగా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333