ఉపాధ్యాయుడు మద్యానికి డ్రగ్స్ కి యువత అలవాటు కావద్దని ప్రచారం

Mar 28, 2025 - 20:43
Mar 28, 2025 - 20:46
 0  4
ఉపాధ్యాయుడు మద్యానికి డ్రగ్స్ కి యువత అలవాటు కావద్దని ప్రచారం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మద్యానికి, డ్రగ్స్ కు బానిస కావొద్దు నిమ్మికల్ పశువుల సంతలో వినూత్న రీతిలో ఉపాధ్యాయుడి స్వచ్ఛంద ప్రచారం. ఆత్మకూర్ ఎస్.. మద్యానికి డ్రగ్స్ కు బానిసలు అవుతున్న యువత చెడు మార్గాల నుండి దూరం కావాలని వినూత్న రీతిలో ఉపాధ్యాయుడు శుక్రవారం మండల పరిధిలో నెమ్మికల్ పశువుల సంతలో ప్రచారం నిర్వహించాడు. మాదక ద్రవ్యాల కారణంగా విద్యావంతులు, మేధావులు సైతం బానిసలవుతున్నారని మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి సమాజానికి మేలు చేయాల్సిన యువత కీడు చేస్తుందని అందుకే మద్యాన్ని మానుకోవాలంటూ నల్లటి దుస్తులతో పుర్రె ఎముకలు ఉన్న దుస్తులను ధరించి ఓ మైకుతో ప్రచారం ప్రారంభించాడు. మద్యం మాదకద్రవ్యాల వలన జరిగే నష్టాలను కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తూ సంతలోని వారందరికీ పంచారు. సూర్యాపేటకు చెందిన రాచకొండ ప్రభాకర్ మద్దిరాల మండలం గోరంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేస్తూ సమాజంలో తన వంతు బాధ్యతగా మద్యం మార్గద్రవ్యాల బారిన పడకుండా ప్రచారం చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఎంతో భవిష్యత్తున యువకులు గ్రామాల్లో పట్టణాల్లోనూ గంజాయి మద్యం డ్రగ్స్కు బానిసలుగా మారుతూ సమాజానికి చెడు చేస్తున్నారని వాటి నుండి దూరం కావాలంటూ కోరారు. సంతలో తన మైకు ద్వారా మద్యం డ్రగ్స్ పై నినాదాలు చేస్తూ ప్రచార నిర్వహించారు పలువురు ప్రభాకర్ చేస్తున్న ప్రచారాన్ని అభినందించారు.