ఉద్యోగ ఉపాధి అవకాశాలకై నేటి యువత ఉద్యమించాలి

 సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు

Feb 25, 2024 - 19:08
 0  4
ఉద్యోగ ఉపాధి అవకాశాలకై నేటి యువత ఉద్యమించాలి

నేటి యువత ఎదుర్కొంటున్న ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పాలకవర్గాలపై ఉద్యమించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ధర్మ బిక్షం భవన్లో ఈరోజు జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య  AIYF జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ప్రపంచంలోనే యువకుల సంఖ్య ఎక్కువగా ఉన్న మన భారతదేశంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని దేశంగా కూడా ముందంజలో ఉందని అన్నారు. పాలకవర్గాలు ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాలు కల్పిస్తామని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇంకా ఎన్నో రకాల హామీలను ఇస్తూ వారి ఓట్లను దండుకొని అధికారలోకు వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారి జీవితాలను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో యువత గంజాయి మత్తుమందు మద్యపానం వాటికి అలవాటు పడేలా దేశంలో వాటిని ఎక్కువగా సమాజంలోకి  తీసుకు వెళ్తున్న వారి పట్ల అలసత్వం వహిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని రైతు ఉద్యమాల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గత కొన్ని రోజుల నుండి ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమాలకు మద్దతుగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సిపిఐ  పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కదిలి జిల్లా సెంటర్లో నిరసన కార్యక్రమం చేయాల్సి ఉన్నందున ది 26.2.2024న ఉదయం 10 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం ధర్మ బిక్షం భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు మండల పట్టణ కార్యదర్శులు ప్రజాసంఘాలు బాధ్యులు అధిక సంఖ్యలో తరిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో  ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి చేపూరి కొండలు జిల్లా అధ్యక్షులు చిలక రాజు శ్రీను సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అనంతుల మల్లీశ్వరి  సిపిఐ సూర్యపేట పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు  ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎడెల్లి శ్రీకాంత్ ,అనంతుల రాము , కడారు మధు, సయ్యద్ ఫయాజ్ మియా, వీరన్న, లింగరాజు  శ్రీను, గోపగాని రవి తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333