ఉదారతను చాటుకున K.T దొడ్డి ఎస్సై బిజ్జ శ్రీనివాసులు
జోగులాంబ గద్వాల 1 నవంబర్ 2002 తెలంగాణ వార్త ప్రతినిధి:-కేటి దొడ్డిమండలం ఎస్సై బిజ్జ శ్రీనివాసులు ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గద్వాల నియోజకవర్గం కేటి దొడ్డి మండల కేంద్రంలోని సుజాత ఉరుకుంద వీరి కుటుంబం గుడిసెలో నిద్రిస్తుండగా గురువారం మధ్య రాత్రి షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో గమనించిన ఉరుకుంద సుజాత వారి పిల్లలు కట్టుబట్టలతో బయటికి రావడం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు పూర్తి గా గుడిసె కాలిపోయి దగ్ధం అవడం, గుడిసెలో ఉన్న నిత్య అవసర సరుకులు, బట్టలు, గుడిసెలో నిలువ ఉంచిన పత్తి ఈ కుటుంబానికి సంబంధించిన ఆధార్ కార్డులు ప్రతి ఒక్కటి పూర్తిగా మంటలో ఖాళీ దగ్ధం అయ్యాయి అని తెలిపారు. ఇట్టి విషయం తెలుసుకున్న కేటి దొడ్డి మండలం ఎస్సై బిజ్జ శ్రీనివాసులు ఉదారతను చాటుకుని బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు ఉరుకుంద సుజాత కుటుంబానికి అందజేశారు. మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి సహాయంగా నిలబడిన కేటి దొడ్డి మండలం ఎస్సై బీజ్జ శ్రీనివాసులకు గ్రామ ప్రజలు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఎస్సై తో పాటు వారి సిబ్బంది ఉన్నారు.