ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిర్మల్,సోమశిల 

అవార్డులను ప్రదానోత్సవం చేసిన  భారత ఉపరాష్ట్రపతి

Sep 27, 2024 - 18:49
 0  6
ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిర్మల్,సోమశిల 

జిల్లా నుండి అవార్డు అందుకున్న కల్వరాల నరసింహ

▪️మహబూబ్ నగర్ : 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ ఎనిమిది కేటగిరీలలో నిర్వహించిన పోటీలలో ఉత్తమ పర్యాటక గ్రామం"క్రాఫ్ట్స్"కేటగిరీలో నిర్మల్ జిల్లా నిర్మల్,"స్పిరిచ్యువల్ - వెల్నెస్" కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల గ్రామాలు ఎంపిక అయినట్లు తెలంగాణ సమాచార కేంద్రం,న్యూఢిల్లీ పౌర సంబంధాల అధికారి శుక్రవారం ఒక ప్రకటనాలో తెలియజేశారు.శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో  "భారత ఉపరాష్ట్రపతి "జగ్దీప్ ధన్కడ్" ముఖ్య అతిధిగా  హాజరై  అవార్డుల ప్రదానోత్సవం చేశారు.నిర్మల్ జిల్లా నుండి అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్,నిర్మల్ టాయ్స్,ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.పెంటయ్య,  నాగర్ కర్నూల్ జిల్లా నుండి  జిల్లా పర్యాటక శాఖ అధికారి టి.నర్సింహా అవార్డులను అందుకున్నారు.మంత్రి జూపల్లి కృషి వలన సోమశిల టూరిజం అభివృద్ధి జరిగిందని, అందుకే అవార్డు దక్కిందని కల్వరాల నరసింహ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333