ఉచిత వైద్య సేవ.
జోగులాంబ గద్వాల 2 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల పట్టణం వేద నగర్ లో ఉన్న దయానంద విద్యా సమితి నందు ఉచిత వైద్య సేవ కార్యక్రమం నిర్వహించారు. తలమర్ల మోహన్ రెడ్డి USA , పాఠశాల కార్యదర్శి బండ్ల నాగేశ్వర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉచిత వైద్య సేవ అందిస్తున్నట్లు దయనంద సమితి వారు తెలిపారు. ఈరోజు డాక్టర్ అనిరుద్ కుమార్ అల్లం ( MD.GENERAL MEDICINE DM, Cardiolgy)Interventional Cardiologist గుండె వ్యాధి నిపుణులచే వైద్య సేవలు అందించారు .ప్రతి ఒక్కరికి బీపీ .షుగర్ , ECG, 2D ko టెస్ట్లు చేసి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. దాదాపు120 మందికి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు ఇచ్చారు. గుండె వ్యాధి నిపుణులు ప్రతినెల మొదటి ఆదివారం రోజు వస్తున్నట్లు డాక్టర్ అనిరుద్ అల్లం కార్డియాలజిస్ట్ తెలిపారు .ఈ కార్యక్రమంలో దయానంద విద్యా మందిర్ ప్రిన్సిపల్ హరినాథ్ రెడ్డి. హెడ్మాస్టర్ సత్యకుమార్. హరిచరణ్ . దోత్రే మనోజ్. తిరుమల బుచ్చయ్య, అనిత, వరలక్ష్మి, సుజాత, మహేశ్వరి, హేమలత, రూప, కళ్యాణి, ఉమా , గౌతమి కళ్యాణ్, తిమ్మన్న, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.