ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి

ఆపరేషన్ సింధూర్ లో సైనికుల పాత్ర మరువలేనిది.
జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్.
(సూర్యాపేట టౌన్ మే 7) : ప్రపంచ మానవాళికి నష్టం కలిగించే ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందిస్తేనే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో శాంతి,సామరస్యం నెలకొంటుందని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, సామాజిక ఉద్యమకారులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న ఏ దేశంలో ఉన్న నష్టం జరుగుతుందే తప్ప లాభం లేదన్నారు. ఉగ్రవాదం నిర్మూలన అంశంలో ప్రపంచంలోని అన్ని దేశాది నేతలు ఏకమై ఉగ్రవాదoను నిర్ములించాలని విజ్ఞప్తి చేశారు.పహాల్గం లో అమాయక ప్రజలను, పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద మూకలను వదలొద్ద ని దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం ను కోరుతున్నారని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ లో విరోచిత దాడులు చేసిన భారత సైన్యం పాత్ర మరువలేనిదని కొనియాడారు. ప్రముత్తంగా ఉండి ఉగ్రవాదులు చేసే దాడులను దీటుగా ఎదుర్కొని దేశ ప్రజలను దేశాన్ని సైనికులు రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు ఖమ్మం పార్టీ అంజయ్య గౌడ్ అయితే గాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్యగౌడ్ పట్టేటి కిరణ్ సారగండ్ల కోటేష్ గిరీష్ పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.