ఈ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

Feb 24, 2025 - 20:14
Feb 24, 2025 - 20:16
 0  5
ఈ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

జోగులాంబ గద్వాల 24 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి.:- గద్వాల .-ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 22 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా,అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ,ప్రజల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State