ఈనెల 13న( శనివారం) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాల్ పర్యటన ఖరారు

జోగులాంబ గద్వాల 2 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :
◆కెటిఆర్ తో పాటు గద్వాల్ పర్యటనకు ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ మంత్రులు,ఎంఎల్ సి లు చల్లా,నవీన్ రెడ్డి,ఎంఎల్ ఏ విజయుడు,మాజీ ఎమ్మెల్యేలు మరియు పలువురు బీఆర్ఎస్ రాష్ట్రపార్టీ నేతలు
■గద్వాల్ పట్టణంలోని రాయచూర్ రోడ్డు నుంచి పాత బస్టాండ్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ శ్రేణుల భారీ స్వాగత ర్యాలీ
■సాయంత్రం నాలుగు గంటలకు పాత బస్టాండ్ చౌరస్తాలో భారీ బహిరంగ సభ
★కేటీఆర్ ఆధ్వర్యంలో గద్వాల్ మున్సిపల్ తాజా మాజీ ఛైర్మన్ బిఎస్ కేశవ్, పలువురు మాజీ కౌన్సిలర్లు, వివిధ మండలాల మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి
■ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన కేటీఆర్ గద్వాల్ పర్యటన
-
జోగులాంబ జిల్లాలోని కాంగ్రెస్ కీలక నేతల చేరికల సంధర్భంగా ఈనెల 13న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాల్ పర్యటన కార్యక్రమం ఖరారైంది.ఈమేరకు గద్వాల్ నియోజకవర్గ పార్టీ నేతలు పోలీస్ పర్మిషన్ కోసం జిల్లా పోలీస్ అధికారుల అనుమతి కూడా కోరారు.శనివారం నాడు కేటీఆర్ తో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ముఖ్య నేతలు,పలువురు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సహితం గద్వాల్ నియోజకవర్గ పర్యటనకు రానున్నట్లు సమాచారం.కేటీఆర్ పర్యటన ఖరారు కావడంతో రాయచూరు రోడ్డు నుంచి గద్వాల్ పాత బస్టాండ్ చౌరస్తా వరకు కేటీఆర్ కి భారీ స్వాగత ర్యాలీ ని బీఆర్ఎస్ పార్టీ నేతలు నిర్వహించనున్నారు. అనంతరం పాత బస్టాండ్ చౌరస్తాలో వేలాదిమంది తో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సభా వేదిక మీదనే కేటీఆర్ ఆధ్వర్యంలో పట్టణ తాజా మాజీ ఛైర్మన్ బిఎస్ కేశవ్ ,పలువురు తాజా మాజీ కౌన్సిలర్లు,వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
అయితే స్థానిక ఎంఎల్ ఏ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వివాదాస్పద రాజకీయ వైఖరి నేపథ్యంలో కేటీఆర్ పర్యటన కీలకంగా మారింది. ఫిరాయింపు ఎంఎల్ ఏల అంశంతో పాటు కాలేశ్వరం తదితర రాజకీయ అంశాలు తీవ్రమైన చర్చకు తెరలేపిన సంధర్భంగా కేటీఆర్ గద్వాల్ పర్యటనలో ఏం మాట్లాడనున్నారనేది జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర సర్కార్ పావులు కదుపుతుండటంతో కేటీఆర్ పర్యటన గ్రామాల్లో తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీసింది. రైతులు, యువత తో పాటు అన్ని వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో కేటీఆర్ పర్యటన విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు విస్తృత స్థాయి ప్రచారం, భారీ ఎత్తున ఏర్పాట్లు మొదలుపెట్టారు. జోగులాంబ గద్వాల్ జిల్లా జెడ్పీ చైర్మన్ పీఠంతో పాటు మున్సిపాలిటీలు,జెడ్పీటీసీ, ఎంపీపీ,ఎంపిటిసి, సర్పంచ్ పదవుల కైవసానికి గులాబీ పార్టీ భారీ వ్యహరచనను సిధ్ధం చేసుకున్నట్లు ఆ పార్టీకి సంబంధించిన విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.ఈ నేపథ్యంలో కేటీఆర్ జోగులాంబ గద్వాల్ జిల్లా పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.