ఇసుక ట్రాక్టర్ పట్టివేత

తెలంగాణ వార్త మాడుగులపల్లి మార్చి 14:-ఈరోజు తెల్లవారు జామున ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండారాత్రి పగలు తేడా లేకుండా ప్రభుత్వం మాటలకు విరుద్ధంగా ఇసుకను తరలించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని పలుమార్లు చెప్పిన ప్రభుత్వం మాటలను ధిక్కరించి పాలేరు వాగు నుండి దొంగతనంగా ఇసుకను అక్రమరవాణా చేస్తున్నారని సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని అట్టి ట్రాక్టర్లను స్టేషన్ కి తరలించారు ట్రాక్టర్ యజమానులు కల్వల పాలెం గ్రామానికి చెందిన వలంపట్ల గోపి, తండ్రి దేవయ్య, మరియు చిట్యాల సురేష్, తండ్రి ముత్తయ్య, ల యొక్క ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయనైనది ఎస్సై కృష్ణయ్య తెలిపారు.