ఇందిరమ్మ ఇండ్లు,రాజీవ్ యువ వికాసంలో వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలి

Apr 28, 2025 - 18:41
 0  4
ఇందిరమ్మ ఇండ్లు,రాజీవ్ యువ వికాసంలో వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలి

భువనగిరి 28 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల ఇంటి నిర్మాణం కోసం 5లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి,స్వంత ఇళ్ళు లేని  నిరుపేదలకు ఆవాసం కల్పించెందుకు 2025 జనవరి 26న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పథకం ప్రారంభం సందర్బంగా రాష్ట్ర ముఖ్య మంత్రి ఇందిరమ్మ ఇండ్లలో వికలాంగులకె మొదటి ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు.ముఖ్యమంత్రి ప్రకటన స్వంత ఇళ్ళు లేని నిరుపేద వికలాంగులో చిరునవ్వు చిందించింది రాష్ట్ర ప్రభుత్వం తొలి విడుతలో 71,482 ఇండ్లు మంజూరు చేసింద.ప్రతి నియోజకవర్గనికి 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది.2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాల్లో వికలాంగుకు 5శాతం రిజర్వేషన్స్ అమలు చేయడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే సాధారణ లబ్ధిలో 25 శాతం ఇవ్వాలి. కానీ ఇందిరమ్మ ఇండ్లలో 2016 ఆర్పిడి చట్టం కు భిన్నంగా అధికారులు వ్యవహారిస్తున్నారు. అధికారుల వైఖరి మూలంగా ఇందిరమ్మ ఇండ్లలో వికలాంగుకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉంది.జీవో 1 ప్రకారం, గృహ నిర్మాణ శాఖ విడుదల చేసిన మెమో నెం 1836/ఆర్ హెచ్ &సి ఏ1/2017 మరియు జీవో 33ట్రాన్స్పోర్ట్ రోడ్ మరియు బిల్డింగ్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లలో 5శాతం రిజర్వేషన్స్ అమలు చేయాల్సి ఉంది. కానీ మండల స్థాయిలో ఎంపిడివో లు లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు రిజర్వేషన్స్ అమలు చేయాలని కోరితే ప్రత్యేకంగా వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లలో 5శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నుండి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని చెప్పుతున్నారు.రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తుంటే మండల స్థాయిలో దీనికి భిన్నంగా ఉంది.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఇండ్లలో వికలాంగులకు 5శాతం రిజర్వేషన్స్ అమలు చేయడంతో పాటు ఇంటి నిర్మాణ వ్యయంలో వికలాంగులకు 25 శాతం అదనంద ఇచ్చే విదంగా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రాష్ట్రాంలో 5లక్షల మందికి 6000 కోట్లతో రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని,ఇందులో వికలాంగులకు 5శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు.రాజీవ్ యువ వికాసంలో 25,000 మందికి రుణాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో దరఖాస్తు చేసుకున్న ప్రతి వికలాంగులకు ఎలాంటి షరతులు లేకుండా రుణం మంజూరు చేసే విధంగా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. జిల్లాలో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారం కొరకు  మే నెల 12,13 తేదీలలో 48 గంటలు కలెక్టర్ కార్యాలయం ముందు దీక్షలు చేపడతామని మే 14వ తేదీన వందలాదిమంది  వికలాంగులతో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి కోశాధికారి కొత్త లలిత భువనగిరి మండల అధ్యక్షులు కేతావత్ మురళి నాయక్ నాయకులు పాండల శ్రీహరి రత్నపురం యాదగిరి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333