ఇంటి స్థలాలు లేని నిరుపేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీని పేదలకు ఇంటి స్థలాలు లేని పరిస్థితి ఉంది
116 సర్వే నంబర్ లో ఉన్న ప్రభుత్వ అసైన్మెంట్ భూమి ఆక్రమంగా అమ్ముకుంటున్నారు
పట్టించుకోని స్థానిక అధికారులు
ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి శ్రీనివాస్
మంగపేట, 26 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- ములుగు జిల్లా మంగపేట మండలంలోని నిరుపేదలకు కూలి చేసుకుంటే బ్రతికే వారికి ఇంటి స్థలాలు లేక పక్కన పెట్టి ఉండబడిన సహచరులను ఆశ్రయం తీసుకొని జీవనం చేస్తున్న పేద ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు గుర్తించి ప్రభుత్వ అపాయింట్మెంట్ భూములను గుర్తించి మిగులు భూములను కూడా గుర్తించి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి శ్రీనివాస్ మండల స్థానిక తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కమలాపురం లోని 116 సర్వే నెంబర్ గల భూమి ప్రభుత్వ అసెస్మెంట్ భూమిలో ఉండబడిన మిగులు భూమిని మండల తాసిల్దార్ గుర్తించి ఆ భూమిని నిరుపేదలకు ఇంటి స్థలాలుగా కేటాయించాలని వారు అన్నారు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతంగా 116 లో ఉండబడిన భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకొని అట్టి భూమిని అమ్ముకోవడం జరుగుతుంది. 116సర్వే నంబర్ లోని భూమి ని కొన్ని లక్షల రూపాయలకు ఆ భూమి అమ్ముకుంటున్నారు. అట్టి భూమిని మండల తాసిల్దార్ పూర్తిస్థాయిలో సర్వే చేయించి ఆ భూమిని ప్రభుత్వం వారు ఆధీనంలోకి తీసుకొని పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర కమిటీ ఉన్నత అధికారులను కోరుతున్నారు.
ప్రభుత్వ అసైన్మెంట్ భూములపై నిరుపేదలకు హక్కు
బీద వర్గాలుగా ఉండబడిన ప్రజల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ అసైన్మెంట్ భూములపై లేనివారికి హక్కు కల్పించే చట్టం వారికి ఇచ్చే హక్కు పూర్తి స్థాయిలో లేని ప్రజలకు వ్యవసాయ భూమి గానీ లేదా ఇంటి స్థలాల కోసం గాని నిరుపేదలకు ఆ భూమిని పంచి ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆనాడు ఉండబడిన చట్టాల తోటి హక్కులు కల్పించింది కమలాపూర్ లో ఉండబడిన 116 సర్వేలో ఉండబడిన భూమి పేద వర్గాల ప్రజలకు ఇంటి స్థలాలు లేని ప్రజలకు ఆ భూమిని స్థానిక ఎమ్మార్వో గుర్తించి ప్రభుత్వం తగు సహాయం ప్రజలకు చేయాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పరిక శ్రీనివాస్ వారిని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో టిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు గాజర్ల రాజు మాదిగ జెట్టి రవిందర్ శ్రవణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.