ఇంటింటి సర్వే, ఆన్- లైన్ నమోదు ప్రక్రియపై సమీక్ష సమావేశం:.
జిల్లా కలెక్టర్ బి యం. సంతోష్ .

జోగులాంబ గద్వాల28 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలను, ఆన్-లైన్ డేటా ఎంట్రీని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు.
గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంటింటి సర్వే, ఆన్- లైన్ నమోదు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
సర్వే డేటా ఎంట్రీని ఆపరేటర్లు తప్పులు దొర్లకుండా నిర్వహించేందుకు ఎనుమరేటర్లు తప్పనిసరిగా వారి దగ్గర ఉండి నమోదు చేయించాలని అన్నారు. అవసరమైతే అదనంగా ఆపరేటర్ల సంఖ్యను పెంచుకొని కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్ లు, ట్యాబ్ లతో ప్రతిరోజు సాయంత్రం పారదర్శకంగా పనులు చేపట్టాలన్నారు. డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం, గ్రామీణ ప్రాంతాలలో వలసలు వంటి కారణాలవల్ల అసంపూర్తిగా ఉన్న సర్వేను పూర్తి చేసేందుకు వారి ఫోన్ నెంబర్లు సేకరించి కాల్ చేసి వివరాలు సేకరించి పూర్తి చేయాలన్నారు. నిర్దిష్ట సమయంలో సర్వే నమోదు పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, జడ్పీ సీఈఓ కాంతమ్మ, డిపిఓ శ్యామ్ సుందర్, ఎంపీడీవోలు, ఏపీఓ లు, ఏపీయం లు తదితరులు పాల్గొన్నారు.