ఇంటర్ ఫలితాలలో ప్రతిభ కాలేజ్ విద్యార్థుల ప్రభంజనం
సూర్యాపేట, 12 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇంటర్ పరిక్ష ఫలితాలలో జూనియర్ ఇంటర్ ఎంపిసి లో తమ కాలేజి విద్యార్థులు శివాని, పృద్వితేజలు 470 మార్కులకు గాను 468 మార్కులు సాదించారని, సింధు 467మార్కులు సాదించిందని ప్రతిభ కాలేజ్ సెక్రటరీ, కరస్పాండెంట్ వెంకటరెడ్డి, ప్రిన్సిపాల్ సత్యం బాబు తెలిపారు. 32 మంది విద్యార్థులు 460 కి పైగా మార్కులు సాదించారని వారు తెలిపారు. బైపిసి విభాగంలో స్టేట్ ర్యాంక్ 440 మార్కులకు బిందు శ్రీ కి 436 మార్కులు, సందీప్ 435, స్ఫూర్తికి 434 మార్కులు వచ్చాయని చెప్పారు. 105 మంది విద్యార్థులు 400 కి పైగా మార్కులు సాదించారని వారు తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపిసి ఫలితాలలో 1000 మార్కులకు గాను కోన సంజన 994 , ప్రణతి, సానియా, ప్రవళ్లిక లు 992 మార్కులు సాదించారని వారు తెలిపారు. బైపిసి విభాగంలో కావేటి వైష్ణవి 983, అఖిల 980 మార్కులు వచ్చాయని చెప్పారు. 121 మంది విద్యార్థులు 900 కు పైగా మార్కులు సాదించారని వారు తెలిపారు. ఇంతటి అద్బుతమైన విజయం సాధించిన విద్యార్దిని, విద్యార్థులకు , తల్లిదండ్రులకు, అద్యాపకులకు ధన్యవాదములు తెలిపారు.