ఇంటర్ పరీక్ష కేంద్రాల ఏర్పాట్లు పూర్తి

తిరుమలగిరి 05 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ మోడల్ కాలేజ్, తిరుమల సహకార జూనియర్ కాలేజ్ లను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. తెలంగాణ మోడల్ కళాశాలలో మొదటి సంవత్సరం మొత్తం విద్యార్థులు 131మంది , ద్వితీయ సంవత్సరం మొత్తం విద్యార్థులు180 మంది కాగా తిరుమల సహకార జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం మొత్తం విద్యార్థులు 165 మంది, మంది హాజరుకానున్నారని చీఫ్ సూపరిండెంట్ Dr.P. సంజీవ్ కుమార్ తెలిపారు