ఆత్మహత్య చేసుకున్న ఐఏఎస్ దంపతుల కూతురు
ఐఏఎస్ దంపతులకు చెందిన 27 ఏళ్ల కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఈరోజు ముంబైలో జరిగింది. సౌత్ ముంబైలోని 10వ ఫ్లోర్ నుంచి ఆమె కిందకు దూకి బలవన్మ రణానికి పాల్పడింది.
బాధితురాలిని లిపిగా గుర్తించారు. మహారాష్ట్ర సెక్రటేరియేట్ వద్ద ఉన్న సురుచి అపార్ట్మెంట్లో ఆమె ఈరోజు తెల్లవారు జామున 4 గంటలకు సూసైడ్ చేసుకున్నది. హర్యానాలోని సోనిపట్‌లో ఆమె ఎల్ఎల్బీ కోర్సు చదువుతున్నది.
అకాడమిక్స్ గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. దాని వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు.
అసహజ మరణం కింద కేసును కఫే పరేడ్ పోలీసు స్టేషన్లో రిజిస్టర్ చేశారు. లిపి తండ్రి మహారాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇక ఆమె తల్లి రాధికా రస్తోగీ.. రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నారు...