ఆకస్మిక తనిఖీ చేసిన ఎంఈఓ

తిరుమలగిరి 14 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండల పరిధిలోని మోడల్ స్కూల్ (అనంతారం) ను మండల విద్యాధికారి శాంతయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట గదులు ఇతర గదులు,తరగతి గదులు పరిసరాలను, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం, వంటి మౌలిక వసతులను నిశితంగా పరిశీలించారు. మరియు ప్రిన్సిపల్ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కిచెన్ గార్డెన్ పెంపకం ను చూసి అభినందించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతోపాటు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ఏజెన్సీకి సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు కాకుండా ప్రతిరోజు పాఠశాలకు వచ్చేల చర్యలు తీసుకొని ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టాలని ప్రిన్సిపల్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సంజీవ్ కుమార్, ఉపాధ్యాయులు అశోక్ రెడ్డి, పాఠశాల అధ్యాపకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు