అల్లంపూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే విజయుడు చేతుల మీదుగా ఘనంగా నూతన పల్లెదవాఖాన ప్రారంభోత్సవం
డీఎంహెచ్వో, డిప్యూటీ టీఎంహెచ్వో, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, అతిథులు,గ్రామ సర్పంచ్ మరియు జిల్లా వైద్య సిబ్బంది.
జోగులాంబ గద్వాల 4 మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల .. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె సంధ్య కిరణమై ఆధ్వర్యంలో ఈరోజు మనోపాడు మండలం జల్లాపురం నందు ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ ను.. అలంపూర్ శాసనసభ్యులు .. ఎమ్మెల్యేనూతన పల్లె దవాఖానాను ప్రారంభించారు.. సందర్భంగా శ్రీ విజయుడు కి జిల్లా డిఎంహెచ్వో పూల బొకే తో స్వాగతం పలికారు.. అనంతరం పూజ కార్యక్రమం తో పాటు రిబ్బన్ కటింగ్ తో భవనాన్ని ప్రారంభించారు.. అనంతరం ఎమ్మెల్యే కి శాలువాతో సన్మానం చేశారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నందిని, మరియు గ్రామ పెద్దలు, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప , ప్రోగ్రామ్ ఆఫీసర్లు, డాక్టర్ మహమ్మద్ అలీ, డాక్టర్ జి రాజు, డాక్టర్ ప్రసన్న రాణి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక, MLHP.. యాకుబ్ పాషా, DE శ్రీనివాస్, AE.. రహీమ్,డిపిహెచ్ఎన్ఓ వరలక్ష్మి, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యాంసుందర్, ఏఎన్ఎం ప్రసన్న రాణి, సూపర్వైజర్లు అక్కమ్మ, చంద్రన్న, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.. మరియు గ్రామంలో ఉన్న ప్రజలందరూ పెద్ద ఎత్తున ఇట్టి కార్యక్రమానికి తరిలి వచ్చారు...