అర్హులకు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం సంతోషకరం

Jun 3, 2025 - 19:37
Jun 3, 2025 - 21:15
 0  14
అర్హులకు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం సంతోషకరం

అర్హులకు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం సంతోషకరం

తెలంగాణ వార్త  మంగపేట :- నిరుపేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచిన ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియలో నర్సింహాసాగర్ గ్రామములో పార్టిలకు అతీతంగ నిరుపేదలను గుర్తించి ఇవ్వగా తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది చిల్లర నాయకులు మేమే నాయకులం అని చెప్పుకుంటూ తిరుగుతున్నారని గ్రామములో చిచ్చులు పెడుతూ అమాయక ప్రజల అవసారాలతో ఆడుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు హరికృష్ణ,ఇందిరమ్మ కమిటీ నాయకులు అన్నారు గత పధేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో గుర్తు రాని పేదలు ఇవ్వాల అధికారం పోగానే గుర్తురావడం హాస్యపధంగ ఉందన్నారు 

పదహేను ఏళ్లుగా అధికారం లో ఉంటున్న బిజెపి ప్రభుత్వములో ఎంతమంది పేదలకు ఇల్లులు ఇచ్చారో ప్రజలందరికి తెలుసన్నారు ఈ పూటకో పార్టీ మారే బూటకపు బిజెపి కార్య కర్తలకయిన అయిన కనీస జ్ఞానం ఉండాలని ఎద్దేవ చేశారు గ్రామములో ఎటువంటి మంచి పనులు జరిగిన దరిద్రపు ఆలోచనలతో ప్రతి మీటింగ్ లో చిల్లర వ్యవహారాలు చేస్తూ గ్రామ అభివృద్దీని అడ్డుకుంటున్నారని కేవలం వారి రాజకీయ లబ్ది కొరకు చిల్లర వ్యవహారాలు చేసే వారు తమ పద్దతి మార్చుకొవాలని అన్నారు

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్