అదనపు గదులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

May 30, 2026 - 06:42
May 31, 2026 - 03:21
 0  193
అదనపు గదులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

తిరుమలగిరి 30 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణంలో నాబార్డ్‌ 31.60 లక్షల రూపాయలతో నూతనంగా అదనపు గదులకు శంకుస్థాపన చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. అందులో భాగంగానే విద్యార్థులకు ఉపయోగకరమైన అవసరమైన అదనపు తరగతి గదులను త్వరితగతిన నిర్మించి, వారికి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న ఏ ఈ రంగారావు వార్డ్ కౌన్సిలర్ కారు పోతుల సోమలక్ష్మి నరేష్ ఎస్ ఓ సుస్మిత ,శ్రీనివాస్ ,కే సి డి వెంకట్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు, , స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి