అత్యాచార నిందితుల గణాంకాల నుండి స్ఫూర్తిని పొందాలి

Apr 7, 2024 - 12:11
 0  2

మానవ  తోడేళ్ల  బారి నుండి తప్పించుకోవాలంటే అప్రమత్తత కూడా కీలకమే.

చట్టాలు, పోలీసుల కఠిన చర్యలు, ప్రభుత్వాలు ఉక్కు పాదం మోపినా  తెలిసిన వాళ్లే నిందితులు కావడం పై   దృష్టి సారించాలి.

ప్రభుత్వ ఆమోదిత అసాంఘిక కార్యక్రమాలు   మరింత రెచ్చగొట్టేది నిజం కాదా!

---  వడ్డేపల్లి    మల్లేశము  

భారతదేశంలో అత్యాచారాల  సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంటే  ప్రభుత్వ చర్యలు చట్టాలు  సామాజిక స్పృహ  కట్టడి చేయలేక  ఓడిపోతున్న విషయాన్ని గమనిస్తే ఆందోళన కలగక మానదు.  ఇది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా  అన్ని రాష్ట్రాలలోనూ  విస్తరించిన   జాడ్య ము కాగా  పోలీసు నివేదికలను పరిశీలించినట్లయితే అనేక చేదు వాస్తవాలు బయటపడతాయి.  మానవ ప్రవర్తనలో సామాజిక బాధ్యత  ప్రతిచోట విస్మరించబడుతూ అవకాశవాదం  వ్యక్తిగత జీవితంలోనూ రాజకీయాలలోనూ  తారా స్థాయికి చేరిన వేళ  జరుగుతున్న అత్యాచార నిందితులలో 99 శాతం మంది తెలిసిన వాళ్లే కావడం  మరింత  ఆందోళన కలిగిస్తున్న విషయం.  తెలంగాణ రాష్ట్రంలో  సగటున రోజుకు 6 పైగా అత్యాచారాలు నమోదు అవుతుంటే  నింతులు పరిచయం ఉన్నవాళ్లు ,బంధువులు,  స్నేహితులు,  ఇంటి పక్క వాళ్ళు , ఉద్యోగం చేసే చోట  కలిసి మాట్లాడుకున్న వాళ్లే ఎక్కువగా ఉండడం  కూడా సీరియస్ గా పరిశీలించవలసిన అవసరాన్ని  తెలియజేస్తున్న ది. ఇ o దుకు సంబంధించిన పోలీసు నివేదికలను పరిశీలించినప్పుడు  చట్టాలు, ప్రభుత్వ చర్యలు,  శిక్షలు,  పౌర సమాజం విసురుతున్న  సవాళ్లు కూడా  ఈ తోడేళ్ల ముందు పనికి రాకపోవడా న్నీ పె ను విషాదంగా భావించవచ్చు.  దశాబ్దం క్రితం ఢిల్లీలో జరిగిన  నిర్భయ అత్యాచారం హత్య ఘటన చట్టంగా మారినా,  హైదరాబాద్ షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దిశ  అత్యాచారం హత్య  సంచలనం సృష్టించి చట్టంగా మారడానికి ఎన్కౌంటర్ దారి తీసినా  ఇలాంటి   అపరిచితుల వల్ల జరిగిన సంఘటన లు బహు స్వల్పం అని తెలుస్తున్నది.  అంటే   వివిధ రూపాలలో పరిచయం ఉన్న వాళ్ల వల్లనే ఎక్కువ సంఘటనలు జరుగుతున్నట్లు మనకు అర్థమవుతుంది.

    కొన్ని గణాంకాలను పరిశీలిస్తే:-  అప్రమత్తత కూడా అంతే ముఖ్యం:

  తెలంగాణ రాష్ట్రంలో 2022లో  జరిగిన   మొత్తం 2126 కేసులలో  పెళ్లి చేసుకుంటానని     నమ్మించిన వాళ్లు, పక్కింటి వ్యక్తులు లేదా సహ ఉద్యోగులు,  బంధువులు, కుటుంబ సభ్యులు,  పరిచయం  ఉన్నవాళ్లు  నిందితులుగా జరిగిన సంఘటనలు  2,1 17 కాగా  అపరిచితులు  నేరస్తులుగా ఉన్న సంఘటనలు కేవలం 9  మాత్రమే.  2023లో జరిగిన మొత్తం 2,284 సంఘటనల్లో  సాన్నిహిత్యంగా  కొంత కాలం గడిపిన వాళ్ళు ,పక్కింటి వాళ్ళు ,సహ ఉద్యోగులు, బంధువులు, కుటుంబ సభ్యులు , స్నేహితులు  అత్యాచారానికి పాల్పడిన సంఘటనలు 2278 కాగా  అపరిచితులు పాల్గొన్న సంఘటనలు కేవలం 6 మాత్రమే.  అంటే  తెలిసిన వాళ్లే 

అత్యాచార తోడేల్లుగా  మారుతున్న సంఘటనను సమాజం సీరియస్ గా పరిశీలించాలి.

         పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి కాలయాపన చేస్తూ అక్రమంగా వాడుకోవడం,  అందుకు మహిళలు కూడా  మోసపోవడం  వల్ల ఇలాంటి సంఘటనలు మరిన్ని పెరుగుతున్నాయి.  తెలిసిన వాళ్ళని ఇంటి పక్క వాళ్ళని  బంధువులు స్నేహితులని  అత్యాచారాలకు గురవుతున్న వాళ్లు కూడా  అనేక  కనుక ఇలాంటి సందర్భాలలో అప్రమత్తంగా ఉండడంతో పాటు  అవసరమైతే ప్రతిఘటించగలగాలి.  పోలీసులు ఇతర షీ టీమ్ల సహకారo  తీసుకోవడంతోపాటు ఆత్మస్థైర్యాన్ని మహిళలు ప్రదర్శించడం కూడా  ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో చాలా ముఖ్యం.  అనేక సందర్భాలలో మహిళలు కూడా  అవకాశనివ్వడం  మరిన్ని అత్యాచారాలు జరగడానికి కారణం అవుతున్నది.  అప్రమత్తతో వ్యవహరించడం   పరిష్కారమని ,అనైతిక,  సామాజిక రుగ్మతలకు  అలవాటు పడుతుండడం కూడా  సంఘటనలు చోటు చేసుకోవడానికి కారణమని మానసిక నిపుణులు పోలీసులు  హెచ్చరిస్తున్న నేపథ్యంలో  ప్రభుత్వ బాధ్యత కూడా  పెరిగింది . మద్యపానం, ధూమపానం,  క్లబ్బులు,  ప బ్బులు, ఈవెంట్లు ,అశ్లీల ప్రదర్శనలు,  మీడియా లోపల  ప్రదర్శించబడుతున్నటువంటి అర్థనగ్న శృంగార కార్యక్రమాలు కూడా  యువతను మరింత రెచ్చగొడుతున్నాయని  నిపుణులు సూచిస్తున్న వేళ ప్రభుత్వం  సామాజిక బాధ్యతగా  ఇలాంటి  అక్రమాలపై ఉక్కుపాదం మోపడం చాలా అవసరం . సంఘటనలు జరిగిన తర్వాత విచారణ పేరుతో  కాలయాపన చేసి అయ్యో  అనుకోవడం కంటే  ప్రమాదాలను ముందే పసిగట్టి  నివారణ మార్గాలను కూడా సమాజము ,మేధావులు, పోలీసులు, ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు ముఖ్యంగా ప్రభుత్వం  గుర్తించినట్లయితే  ఈ ఆ సాంఘిక రుగ్మత  అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. కావలసింది  నిబద్ధత,  అంతకుమించిన స్థాయిలో  మానసిక ఆలోచన,పరివర్తన  మరీ ముఖ్యం.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు,  ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333