అత్యవసర సేవలకు 112 డయల్ చేయండి: ఎస్సై వెంకట్ రెడ్డి

Aug 6, 2026 - 21:16
 0  5
అత్యవసర సేవలకు 112 డయల్ చేయండి: ఎస్సై వెంకట్ రెడ్డి

  తిరుమలగిరి 07 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

ప్రజలకు అత్యవసర సమయాల్లో తక్షణ రక్షణ, సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘డయల్ 112’ (ఆల్ ఇన్ వన్) సేవలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు డయల 112 ఫిర్యాదులపై అత్యంత వేగంగా స్పందించి, బాధితులకు తక్షణమే రక్షణ మరియు అవసరమైన సేవలను ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం 18 రకాల అత్యవసర సేవలను ఒకే ఒక్క ‘డయల్ 112’ నంబర్ పరిధిలోకి తీసుకువచ్చిందని వివరించారు. ప్రమాదాలు, ఆపదలు, శాంతిభద్రతల సమస్యలు లేదా మరేదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా 112 నంబర్‌ను సంప్రదించాలని అన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి