అడ్డగూడూరు మండలంలోని వైద్య సిబ్బందిని నియమించాలి
అడ్డగూడూరు10 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– అడ్డగూడూరు మండలంలోని వివిధ గ్రామాలలో వైద్యం అందని ద్రాక్షాల మిగిలిపోయిందని సిపిఎం అడ్డగూడూరు మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ అన్నారు.అడ్డగూడూరు ప్రభుత్వ హాస్పిటల్ లో పూర్తిగా కాలి పోస్టులతో ఇబ్బందులు ఈ సందర్భంగా సీపీఎం అడ్డగూడూరు మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ..మండల కేంద్రంలో ఉన్న చుట్టూ 17గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి మండలంలో ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్ లో పూర్తిస్థాయిలో అధికారులు లేక మండల వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికే ప్రభుత్వ డాక్టర్ గా ఉన్నటువంటి భార్గవి డిప్యూటేషన్ మీదనే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ లేక మరియు సూపర్డెంట్ లేక పూర్తిస్థాయిగా అన్ని పోస్టులు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది కనీసం జిల్లా స్థాయి అధికారులు ప్రభుత్వ ఆస్పటల్ మీద పర్యవేక్షణ చేయకపోవడం నిమ్మకు నీరు ఎత్తినట్టుగానే వివరిస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రజల ప్రాణాలు కాపాడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం గానీ ప్రభుత్వ అధికారులు గానీ వ్యవహరిస్తున్నట్టు కనపడుతలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా ప్రజలు పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యం లేకపోయినా ఈ హాస్పిటల్ కి ప్రతిరోజు అనేకమంది వివిధ ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్కు వస్తున్న కూడా హాస్పిటల్లో కనీసం ఇంజక్షన్ వేయించుకోవడానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.తక్షణమే పోస్టులన్నిటిని పూర్తిస్థాయిలో నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా డిఎంహెచ్ఓ డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు వళ్ళంబట్ల శ్రీనివాసరావు,శీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.