అడ్డగూడూరులో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
అడ్డగూడూరు 5 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– అడ్డగూడూరు మండల కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త,ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు మరియు స్థానికులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.తెలంగాణ ఆవిర్భావానికి ఆయన అందించిన ఆలోచనలు, ఉద్యమానికి చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు పూజారి వనజా సైదులు,మందుల రేణుక కిరణ్,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగులపల్లి దేవగిరి, మాజీ ఎంపీటీసీ పోలపల్లి జనార్దన్ రెడ్డి,బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గజ్జల రవి,ఎలిజాల దయాకర్,బాలెంల బాబురావు,తోట నవీన్, నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.