అంగన్వాడి సెంటర్ కు వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థి
తిరుమలగిరి 19 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దే యువకుడి పాత్ర సమాజ మార్పునకు ఒక గొప్ప నిదర్శనం. నేటి ఆధునిక కాలంలో ఎంతో మంది యువకులు, పూర్వ విద్యార్థులు తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని మార్చడానికి నడుం బిగిస్తున్నారు. కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా, తమ సొంత ఆలోచనలు, శ్రమ మరియు సమాజ భాగస్వామ్యంతో పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నారు. తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి ముక్కెర మహేష్ అనే యువకుడు ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టి పదో వార్డులో బరిలో నిలిచి స్వల్ప ఓటమిపాలైనప్పటికీ తమ సొంత నిధుల తో అంగన్వాడి కేంద్రంలో ఫ్యాన్లు అమర్చి చిన్నపిల్లలకు దాహం తీర్చాలని ఉద్దేశంతో మినీ వాటర్ ప్లాంట్ కోసం పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం కానీ నా మానవత్వం దృక్పథంతో ఒక పూర్వ విద్యార్థిగా గ్రామ అభివృద్ధి కొరకు అనేక విధాల నా వంతుగా సహాయం అంద చేస్తున్నాను ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాను నన్ను కన్న నా ఊరికి రుణపడి ఉంటాను అని అన్నారు.