హలో ఉద్యమకారుడా చలో డిండి చింతపల్లి పోస్టర్ ఆవిష్కరణ
తిరుమలగిరి 14 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ రెహమాన్ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో చలో డిండి చింత పల్లి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీయూజేఏసీ ప్రధాన కార్యదర్శి కోతి మాధవి మాట్లాడుతూ ఈ నెల 21న నాగర్ కర్నూల్ జిల్లా డిండి చింతపల్లిలో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం ఆవిష్కరణ సభ ఉంటుందని తెలిపారు. ప్రతీ ఉద్యమకారుడు ఈ సభలో పాల్గొని విజయంతం చేయాలని కోరారు. తెలంగాణ కోసం ఎంతో మంది వీరులు నేలకొరిగారని, వారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కే రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు ఏలూరు బాబు, సహాయకార్యదర్శి జే విష్ణు, కూరపాటి శ్రీను, బైరబోయిన వెంకన్న, షాంద్ పాషా, సామాజిక తెలంగాణ మహాసభ అధ్యక్షులు కొత్తగట్టు మల్లయ్య సామాజిక ఉద్యమకారుడు కందుకూరి ప్రవీణ్ ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కందుకూరు సోమన్న సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటీ కరుణాకర్, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రబు, చేను శ్రీనివాస్ జై భారత్ నాయకులు దుస్సా మూర్తి, ఫతేపురం యాదగిరి, టి యు జేఏసీ నాయకులు ఎర్రబెల్లి వెంకన్న కందుకూరి మహేష్ రజక సంఘం మండల శాఖ అధ్యక్షులు పులిమామిడి సోమన్న, పులిమామిడి భిక్ష0, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు బన్వరి నరసయ్య, సిపిఎం నాయకులు పానుగంటి శ్రీనివాస్, పాలబిందెల మహేష్ ,ఈదునూరి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.