*భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Jul 30, 2026 - 07:35
 0  2
*భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

*భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*

పేరూరు ఎస్పై కృష్ణ ప్రసాద్

వాజేడు జులై 29 (తెలంగాణ వార్త)

పేరూరు పరిధిలోని గోదావరి, వాగులు, వంకలు పొంగిపర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేరూరు ఎస్సై జి. కృష్ణప్రసాద్ సూచించారు... ?ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి, వాగులు, కల్వర్టు, లోతట్టు ప్రాంతాలను దాటే ప్రయత్నం చేయవద్దని, చేపల వేట కోసం గోదావరి, వాగులు, చెరువులు, ఇతర జలాశయాలకు వెళ్లరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాపాయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనవసరంగా బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ?పశువుల కాపరులు పశువులను మేతకు అటవీ ప్రాంతానికి వెళ్లినపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అటవీ ప్రాంతంలో ఉండే వాగులు, లోతట్టు ప్రాంతాలు దాటరాదని, కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున వాటి సమీపంలో పశువులను మేపరాదని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినట్లయితే వెంటనే పోలీస్ అత్యవసర సేవా డయల్-100 కు సమాచారం అందించాలని కోరారు. మర్రి వాగును, రేగుమాగు వాగును పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టబడుతున్నాయని తెలిపారు.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్