భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

Jul 9, 2026 - 12:36
 0  10
భార్యను  హత్య చేసి భర్త ఆత్మహత్య

తుంగతుర్తి  09 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో భార్యాభర్తలైన కోట సత్యనారాయణ, కనక లక్ష్మీ లు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు... గొట్టిపర్తి గ్రామానికి చెందిన కోటా సత్యనారాయణ (62) , భార్య కనకలక్ష్మి(58) మధ్యన తరచూ గొడవలు సాగుతుండేవి. కొన్ని రోజుల క్రితం కనక లక్ష్మి కొడుకు వద్దనే ఉంటుంది. ఈ మధ్యనే గొట్టిపర్తికి రాగా , వీరి మధ్య మళ్లీ గొడవలు సాగాయి. దీనితో బుధవారం రాత్రి భార్య కనకలక్ష్మిని, భర్త తలపై దాడి చేయగా, రక్తస్రావం జరిగి మృతి చెందింది. దీనితో భయానికి లోనైనా సత్యనారాయణ తాడుతో ఉరిపోసుకొని, మృతి చెందాడు. దీనితో గొట్టిపర్తి లో ఒకే కుటుంబంలో భార్యాభర్తలు మృతి చెందడం, విషాదఛాయలు అలుముకున్నాయి. జరిగిన సంఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి