పరిపాలనకు  ప్రాధాన్యత ఇవ్వడంలోనే  పార్టీలు తప్పటడుగు వేస్తున్నాయి

Mar 31, 2026 - 12:04
 0  0

 ఎన్నికల మ్యానిఫెస్టోలు   వాగ్దానాలుగా మిగిలిపోతే.?, చట్టసభల్లో పాలక ప్రతిపక్షాల  దాడులు,  రాజకీయ, ఉద్యో గ  సిబ్బంది అవినీతి  ప్రజలను బలి పశువులను చేస్తున్నాయి .
-----వడ్డేపల్లి మల్లేశం 9014206412 
-----28....04....2025******
"ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉన్న సుగుణాలు  గెలుపు కంటే  ఆ పరిపాలన క్రమంలోనే పేద ప్రజలు ఓడిపోవడాన్ని  పాలకులు  కార్పొరేట్ సంస్థలు  గెలవడాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇది ప్రజాస్వామ్య వైఫల్య o కాదు పాలకుల బాధ్యతా రాహిత్యం.  ఇక అధికార యంత్రాంగంలో  క్రింది నుండి పై స్థాయి వరకు ఉన్న  సిబ్బంది యొక్క అవినీతి  ప్రజల జలగలా పీల్చి  అవసరమైన సందర్భంలో ప్రభుత్వ అధినేతల సహకారాన్ని పొంది కేసుల నుండి తప్పించుకొనే ధోరణి  పాలకుల కనుసన్నల్లో  కొనసాగినంత కాలం  ఈ దేశంలో  ప్రజలు నిరంతరం ఓడిపోతూనే ఉంటారు". ఇక పాలకులు  ఎన్నికల సందర్భంలో  ప్రకటించే  మేనిఫెస్టో అబద్ధాలతో ప్రారంభించి మూడు  పువ్వులు ఆరు కాయలుగా  మారినట్లు  వేదికల మీద చట్టసభల్లో అధికార కార్యక్రమాలలో అబద్ధాలతో  తప్పించుకుంటూ ప్రతిపక్షాల విమర్శలకు సరైన జవాబులు చెప్పకుండా దాటవేస్తూ  తమ విధానాలలో  స్పష్టత ప్రకటించకుండా ఐదేళ్లు  గడపడమే ముఖ్యం వీరికి. తిరిగి మళ్లీ అధికారానికి రావడమే అంతకంటే ప్రాముఖ్యత గల అంశం.  అంతేకాదు 20 ఏళ్ల పాటు మేమే కొనసాగుతాం అని డా o బికాలు ప్రదర్శించడం  ఇవాళ రాజకీయ పార్టీల యొక్క దినచర్య  ప్రాథమిక అంశంగా మిగిలిపోయింది. 
ఎన్నికల మ్యానిఫెస్టోలు- అమలు చేస్తున్న విధానాలు 
---**********-
పరిపాలన కాలంలో సాధ్యాసాధ్యాలను  ఊహించకుండానే  పరిశీలించకుండానే  ఎదుటి రాజకీయ పార్టీ ఇచ్చిన హామీలకు రెట్టింపు  వాగ్దానాలను చేయడంతో పాటు ఎన్నికల్లో గెలవడానికి చేసిన ఆరాటం తప్పిదాలు అంతా ఇంతా కాదు. ఆ రకంగా గెలవడానికి  వేసిన పన్నాగాల మధ్య అధికార పార్టీగా  ప్రభుత్వ ఏర్పాటు తర్వాత  ఆచరణలో సాధ్యం కాక, వివిధ వర్గాల నుండి వచ్చే డిమాండ్ ను పరిష్కరించే  సామర్థ్యం ప్రతిభ అధికార పార్టీలో లేక,  చట్టసభల్లో బయట ప్రతిపక్షాలు ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానాలను దాటవే  దాటవేస్తూ ప్రజల ప్రజాస్వామిక వాదుల మేధావులను కూడా పిచ్చివాళ్లుగా చేస్తున్న చట్టసభల పనితీరు పార్లమెంటు నుండి  రాష్ట్ర శాసనసభలు అంతేకాదు బహుశా గ్రామ పంచాయితీ వరకు కూడా ఇదే విధానం కొనసాగుతుందని అన్నా అభ్యంతరం లేదు. బడ్జెట్ అంటేనే అంకెల గారడి అని  భవిష్యత్తును ముందుగానే ఊహించి  నిధులను మంజూరీ చేసినట్టు ప్రకటించి ఆ ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఖర్చు చేయకపోగా కేటాయించినవి కూడా అంతంత మాత్రంగానే ఉన్నప్పుడు  ఆ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదు అని అర్థం. "ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి?  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి?  మౌలిక సమస్యల పరిష్కరించడం ద్వారా ప్రజలను  తమ కాళ్ళ మీద తమ నిలబడే విధంగా తీర్చి దిద్దవచ్చు అనే ఆలోచన   అసమానతలు అంతరాలు వివక్షత లేనటువంటి సమ సమాజాన్ని స్థాపించే క్రమంలో  విద్యా వైద్యము సామాజిక న్యాయము ఉపాధి  ఇండ్ల సౌకర్యం కల్పించే విషయంలో  ముందుచూపు లేకపోవడం వలన  భారతదేశ వ్యాప్తంగా విద్యా వైద్యం వ్యాపారంగా మారి  ప్రభుత్వ ప్రతినిధులకు  బంధువులు స్నేహితులకు  ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వడంతో పాటు  మంత్రులు ముఖ్యమంత్రులు, ప్రధానితో సహా అందరూ కూడా ప్రైవేటు సంస్థల ప్రారంభోత్సవాలకు విచ్చేసి  ప్రభుత్వ రంగాన్ని నీరుగారు స్తున్న విషయం మనకు అందరికీ తెలుసు ".దూర దృష్టి, భవిష్యత్తు సవాళ్లు, విద్యా వైజ్ఞానిక సామాజిక ఆర్థిక శాస్త్రీయ సాంకేతిక రంగాలలో  ఎదురయ్యే సమస్యలు,  సవాళ్లను పరిష్కరించే నైపుణ్యాన్ని యువతలో సాధించడం కోసం ప్రణాళిక అంటూ పాలకులకు లేకపోవడం వలన  ప్రతి విషయంలోనూ మనకు సంబంధించి ఇతర దేశాల నుండి  సాంకేతిక పరిజ్ఞానాన్ని సేకరించుకోవడంతోనే సరిపెడుతున్నాం. ఇక దానిని ఆచరించి అమలు చేసే అవకాశం ఎక్కడిది? ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశాలను  పరిపాలన క్రమములో చట్టసభల ఆమోదంతో అమలు చేసిన దాఖలాలు అంతకు లేవు.  అందుకు బదులుగా  అధికార ప్రతిపక్షాలు పరస్పరం దాడులకు పాల్పడుతూ ప్రజలను పిచ్చివాళ్లుగా చూస్తూ  బలహీనులను చేస్తున్న సంగతి మనకు తెలుసు. ఆ క్రమంలో ఉద్భవించినదే  ప్రజలను  యాచకులుగా మార్చే ప్రక్రియ... ఎన్నికల సందర్భంలోనూ ఇతరత్రా చిన్నచిన్న కోరికలను అమలు చేస్తూ  ఉచితాలు తాయిలాలతో ప్రజలను మభ్యపెడుతూ ప్రజలు ప్రశ్నించకుండా ప్రతిఘటించకుండా  బుజ్జగించే ధోరణి కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు.
  పాలక ప్రతిపక్షాల పరస్పర దాడులు 
************
దేశ రాజధాని లో కల పార్లమెంటుతో సహా  రాష్ట్రాల శాసనసభలు  జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ కౌన్సిల్ గ్రామపంచాయతీ వరకు కూడా  అధికార ప్రతిపక్షాలు పరస్పర దాడులు భిన్న ఆరోపణలతోనే తమ పబ్బం గడుపుతున్న తీరు జగమెరిగిన సత్యం.  ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ముఖ్యంగా  పనిగట్టుకొని  తమ కాలములో చేయని వాటిని పక్కనపెట్టి  అమలు చేసినటువంటి వాటిలో ఉన్న అనేక లొసు గులను దాచుకొని  ప్రస్తుత ప్రభుత్వాలను మాత్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని  నిలదీయడం కూడా కొంత  వివాదాస్పదంగా మారుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే అమరావతిని రాజధానిగా గత ప్రభుత్వం ప్రకటించి సాక్షాత్తు  దేశ ప్రధాని శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు ముక్కలాట పేరుతో రాజధానులను విభజించి  ఐదేళ్ల కాలంలో రాజధాని లేకుండానే ఎలాంటి అభివృద్ధి జరగకుండానే కాలం గడిచింది అంటే పాలకుల చిత్తశుద్ధి ఎంత అద్వాన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  అదే పద్ధతిలో  తెలంగాణ రాష్ట్రంలో కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం  చెట్లకు గుట్టలకు పుట్టలకు రోడ్లకు ప్రాజెక్టులకు వంతెనలకు కూడా  రైతుబంధు పేరుతో అక్రమార్కులకు ప్రజాధనాన్ని కట్టబెట్టి  కోట్లాది రూపాయలను అప్పు చేసిన సంగతి మనకు తెలుసు. భూములు ఉన్న వాళ్లకు l అంతో ఇంతో  ఆదాయం ఆస్తి ఉంటుంది కానీ అసలే భూమి లేనటువంటి వారి గురించి ఆలోచించకుండా ఆ రకంగా దుర్వినియోగం చేయడం అంటే నిజంగా  ఆ విధానం పైన విచారణ జరగాల్సిందే.  అయితే ప్రస్తుత  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా  మిగతా రాష్ట్రాలు కూడా  విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత నివ్వడం ద్వారా  ప్రభుత్వ రంగంలో ఉచితంగా అందించాల్సిన అవసరం ఉంది .గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగినటువంటి ప్రభుత్వం యొక్క  విధానాలను ఆదర్శంగా తీసుకొని  విద్యా వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తే ప్రజలు హర్షిస్తారు  అప్పుడే ప్రపంచంతో పోటీ,  ప్రపంచంలో మాకు ఎవరు సాటి లేరు అనే ప్రభుత్వాల యొక్క నినాదాలకు అర్థం ఉంటుంది. "అధికారంలో కొనసాగుతున్న ప్రభుత్వం ఏనాడు విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని హామీ ఇచ్చిన దాఖల దేశంలో ఎక్కడా లేదు. అదే పార్టీ తిరిగి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత  ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలను కూడా విద్య వైద్యాన్ని డిమాండ్ చేసిన సందర్భాలు లేవు. అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా  ఒకే తానులోను ముక్కలని తాత్కాలిక ప్రలోభాల మీద ఆధారపడి మాత్రమే కొనసాగుతున్నాయని  అందుకే ప్రజలు చైతన్యవంతులు కాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగమే ఈ వాగ్దానాలు ఉచితాలని  ఇప్పటికీ ప్రజలు అర్థం చేసుకోకపోతే భవిష్యత్తులో  ప్రజల గుండెల మీద కాలు పెట్టి  దాడి చేసి ఒప్పించి  గెలిచే రోజులు  వస్తాయేమోనని  ఆనాడు ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రాజకీయ సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు."
       " ఇక  ఉద్యోగులు, రాజకీయ యంత్రాంగంలోనూ  అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు  అక్రమస్తులను కూడా పెట్టుకోవడం కోసం అనవసరంగా కొన్ని పనులను మంజూరు చేసి,  వాటిలో నాణ్యత లేకుండా చేసి,  నిర్మాణాల వరకే సరిపుచ్చి,  ప్రారంభానికి కూడా నోచుకోనటువంటి అనేక భవనాలు ఇప్పటికీ దేశవ్యాప్తంగా కోకొల్లలు.  ప్రజాధనాన్ని దూర్వినియోగం చేసే అధికారం పాలకులకు ఎక్కడిది?"  ""ఈ దేశంలో న్యాయ వ్యవస్థ తనకంటూ ఒక స్పష్టమైనటువంటి అవగాహన దృష్టితో  దేశంలో మూలమూలన కొనసాగుతున్న అధికార యంత్రాంగం రాజకీయ ప్రతినిధుల యొక్క అవినీతిపైన ఉక్కు పాదం మోపాలి. అందుకు  విచారణ జరపడం ద్వారా దోషులను శిక్షించి రాజకీయ అవినీతిని బట్టబయలు చేయాలి. పాలకులకు  గుండె దడబుట్టేలా  శిక్షలు విధించాలి ."కార్యనిర్వాహక  శాసన నిర్మాణ శాఖలు కూడా  సంపూర్ణంగా సమగ్రంగా  ప్రజల కోణంలో ఆలోచించకపోవడం, కార్పొరేట్ వ్యవస్థకు మద్దతు పలకడం  ఒక లోపం అయితే   ఇక స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ కూడా   కఠిన నిర్ణయాలు తీసుకొని  దోషులను కఠినంగా శిక్షించడానికి అంతగా సాహసించడం లేదంటే ఈ దేశంలో రాజకీయ పార్టీల యొక్క ప్రాబల్యం ఎంతగా  వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు గమనించి అవసరమైన మేరకు ప్రతిస్పందించాలి."
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333