తాసిల్దార్ కి వినతిపత్రం అందజేసిన ఉపాధ్యాయులు
అడ్డగూడూరు 18 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల తహసీల్దార్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్షులు పెండెం శ్రీనివాస్ రాష్ట్ర ఆడిట్ కో కన్వీనర్ పెద్దిరెడ్డి శంకర్ రెడ్డి,నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.