73 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

Jun 27, 2026 - 16:24
Jun 27, 2026 - 18:17
 0  0
73 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల 27 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల:- జిల్లాలోని మూడు ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 64 అంగన్‌వాడీ టీచర్, 9 గిరిజన ప్రాంతాల అంగన్‌వాడీ ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 73 పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు:

ఐసీడీఎస్ గద్వాల అర్బన్ ప్రాజెక్ట్: 28 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 5 ఆయా పోస్టులు (మొత్తం 33)

ఐసీడీఎస్ మల్దకల్ ప్రాజెక్ట్: 22 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 4 ఆయా పోస్టులు (మొత్తం 26)

ఐసీడీఎస్ మానవపాడు ప్రాజెక్ట్: 14 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు

ముఖ్యమైన సమాచారం:

దరఖాస్తుల స్వీకరణ: జూన్ 29 నుండి జూలై 8వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు.

దరఖాస్తు విధానం: కేవలం ఆన్‌లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.అధికారిక వెబ్‌సైట్: అర్హతలు, నిబంధనలు, పూర్తి వివరాల కోసం అభ్యర్థులు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.wdcw.tg.nic.in/ ను సందర్శించాల్సి ఉంటుంది.ఈ నియామక ప్రక్రియను ఏ దశలోనైనా రద్దు చేసే పూర్తి అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అర్హత గల స్థానిక మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State