70మంది విద్యార్థుల గదులను స్టోర్ రూమ్ గా ఉపయోగం

Aug 31, 2026 - 18:58
 0  0
70మంది విద్యార్థుల గదులను స్టోర్ రూమ్ గా ఉపయోగం
70మంది విద్యార్థుల గదులను స్టోర్ రూమ్ గా ఉపయోగం

 తరగతి గదులు లేకుండా నిరుత్సాహంగా ఉంటున్న విద్యార్థులు

 పలు ప్రభుత్వ సంస్థలను సందర్శించిన ఉపా సర్పంచ్...

ఉపా సర్పంచ్ పాయం ఇంద్రకుమారి

ముక్కుగు జిల్లా, ఆగస్టు :31 :  ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామపంచాయతీ పరిధిలోని కొండాయి ఉపసర్పంచ్ పాయం ఇంద్రకుమారి పలు ప్రభుత్వ సంస్థలను సందర్శించడం జరిగింది. సందర్శించిన క్రమంలో దొడ్ల కొత్తూరు గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలతో ఆమె మాట్లాడడం జరిగింది.దొడ్లకొత్తూరు గ్రామంలో ఎంపీపీఎస్ ప్రైమరీ స్కూల్ లో 70 మంది విద్యార్థులు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. తరగతి గదులను మూడు కంప్యూటర్లు ఉన్నాయి విటనీటికి మాత్రం రెండు తరగతి గదులు మాత్రమే ఉన్నాయి వాటిని స్టోర్ రూమ్ కి ఆఫీస్ రూమ్ కి కంప్యూటర్ ల్యాబ్ కి ఉపయోగం చేస్తున్నారు. గ్రామస్తులకు వారు సభలో గ్రామ అభివృద్ధి కోసం వారు తెలియ పర్చారు.ఉపా సర్పంచ్  మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్ లో ఇంత మంది విద్యార్థులు ఉండడం చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేశారు. దొడ్ల కొత్తూరు గ్రామంలో ఉండబడిన స్కూల్ కి అదనంగా గదులను కేటాయించి కావలసిన సదుపాయాలు పూర్తిస్థాయిలో విద్యాశాఖ అధికారులు వెంటనే చేయాలని గ్రామ ఉపసర్పంచ్ పాయం ఇంద్రకుమారి అన్నారు. గ్రామంలో ఉండవలసిన సేల్స్ డిపో ప్రజలకు నిత్యవసరాలు ఇచ్చే భవనములో పూర్తిస్థాయిలో బియ్యం కందిపప్పులు ఉప్పులు పప్పులను పందికొక్కులు భవనాన్ని పూర్తిస్థాయిలో తవ్వడం జరిగిందని అన్నారు. వెంటనే గిరిజన శాఖ సంక్షేమ అధికారులు ఈ భవనాన్ని మైనర్ రిపేర్ చేయాలని వారు అన్నారు.ప్రస్తుతం ఉన్న అంగన్వాడి నీ కూడా మైనర్ రిపేరు పనులను కూడా అధికారులు చెప్పటలని వారు అన్నారు.తదనంతరం దొడ్లకొత్తూరు గ్రామంలో ఉన్న సమస్యలనుపూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం అని గ్రామస్తులకు ఉపా సర్పంచ్ పాయం ఇంద్రకుమారి సభలో తెలిపర్చారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు వార్డు మెంబర్లు గ్రామస్థాయిలో ఉండబడిన ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333