41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు – నేత్రదానం మహాదానం.

Aug 25, 2026 - 17:14
Aug 25, 2026 - 17:22
 0  9
41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు – నేత్రదానం మహాదానం.

జోగుళాంబ గద్వాల 25 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- జిల్లాలో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు 25-08-2026 నుండి 08-09-2026 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా అంధత్వ నివారణాధికారి మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా,, సంధ్య కిరణ్మై ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ సందర్భంగ ప్రజల్లో నేత్రదానంపై అవగాహన కల్పించడం, నేత్రదానం ప్రాముఖ్యతను వివరించడం, మరణానంతరం నేత్రాలను దానం చేయడం ద్వార చూపులేని వారికి వెలుగును అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. “నేత్రదానం మహాదానం” అని, ఒక వ్యక్తి నేత్రదానం చేయడం ద్వారా చూపులేని వారికి కంటి చూపును అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని, స్వచ్ఛందంగ నేత్రదానం చేయడానికి ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. “సర్వేంద్రియానాం నయనం ప్రధానం” — అన్ని ఇంద్రియాలలో కళ్ళు అత్యంత ప్రధానమైనవని పేర్కొంటు, మీ కళ్ళకు దీర్ఘాయుష్షునివ్వండి... నేత్రదానం చేయండి... చూడలేని వారికి కంటి చూపునివ్వండి... అనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగ తీసుకెళ్లాలని కోరారు. నేత్రదానం చేయాలనుకున్నవారు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు మరియు ఆరోగ్యశాఖ సిబ్బందిని లేదా సరోజినీ దేవి కంటి ఆసుపత్రి మెహదీపట్నం ఫోన్ నెంబర్ 040-23317274, 23340417 గల నెంబర్లకి ప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డా,, ప్రసూన రాణి, డా,, రాజు, డా,, అజ్గర్ అలీ, డా,, రామచంద్ర రావు మరియు ప్రవీణ్ కుమార్ నేత్ర వైద్యాధికారి, తిరుమల్ రెడ్డి SO, DPHNO వరలక్ష్మి, ఇన్చార్జి డెమో హిర్యనాయక్, మరియు కార్యాలయ సిబ్బంది అందరు పాల్గొన్నారు

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State